కవిత్వం గురించి మాట్లాడుతున్నాప్పుడు ఇటివల చదివిన  కవితా సంపుటులు జ్నాపకమౌతున్నాయి.అజంతా స్వప్న లిపి .పల్లె పట్టు నాగరాజు యాలై పూడ్చింది. .జీవిత కాలమంతా నలభై కవితలను రాసి కవిత్వ స్వప్నలిపిని  వదిలివెళ్లిన అజంతా ,వర్తమాన కాలంలో నిలబడి కవితా రచనలో వున్న పల్లి పట్టు నాగరాజు. అసలు వీరిద్దరి భాధ ఏమిటి?. వీరి మధ్య సారూప్యత ఏమిటి? అజంతా  కవితా రచన స్థల ,కాలాలు  వేరు .నాగరాజు కవిగా కొనసాగుతున్న కాల సoధర్భం వేరు. కవి వీరిద్ద‌రి  ప్రపంచం, దాని మనుగడ ఒకే స్తితిలో ఉన్నాయా?  అజంతా కవిత్వంలో అంతర్ముఖీనత ఉండవచ్చు. ఆ లోపలి  చూపు సామాజిక శకల౦తో  ముడి పడి వుంది. కవి తనకి అను వర్తింపు చేసుకునే మానవ విధ్వంసం, దాని రాపిడి కవిత్వ సాంద్రతలోకి దారి చేసుకోగలగాలి. ఆ దారి అజంతాకి దొరికింది . పల్లిపట్టు నాగరాజు వర్తమాన కవి .తన కున్న అస్తిత్వం వేరు .సాధన ద్వారా కవిగా రూపొందిన వాడు . కవిగా విస్తరించడం వెనుక జీవితం పరుచుకొని వున్నది. కేవల౦ జీవితముంటే చాలదు.  సామాజిక చలనంలో  పరుచుకున్న విషాదానికి సంబంధిoచిన పార్శ్వం అత్యంత ముఖ్య మైనది. మనుషుల్ని నడిపిస్తున్న అణిచివేత శక్తుల  మాటేమిటి .దీని చోదక శక్తి  అయిన‌ రాజకీయాల మాటేమిటి?  కవిత్వం ఆసరా చేసుకునే కవి చూపు విశాలత చెందడమంటే జీవితాన్ని నడిపిస్తున్న రాజకీయాల గురించి మాట్లాడటమే. రాజకీయ కవిగా రూపొందే క్రమం లో అతనిలోని కవి అదృశ్యం అవుతున్నాడా , లేదా మరిoతగా బలపడతాడా అనేది  ప్రధాన అoశం. నాగరాజుకు లోచూపు వున్నది .తన కవితా వస్తువు జీవితం నుండి లభించినా ,మానవ జీవన విషాదానికి మూలం పాలన వ్యవస్థలోవున్నాయి. ఈఎరుక ప్రధానమైది .జీవితాన్నిశాసిస్తున్న అనేక అంశాలలో రాజ్యం ప్రధాన భూమిక నిర్వహిస్తుంది.దీనిని అర్ధo చేసుకోవడానికి ,లేదా దీనిని ధిక్కరించడానికి,జీవిత౦లో రాపిడి వున్నకవి ఎక్కువ సమయం తీసుకోడు. సృజనాత్మక తలంపై నిలబడి మొట్ట మొదటి కవితా సంపుటితోనే నాగరాజు ఈ అవగాహనకు  వచ్చి ఉన్నాడు.కవితను నిర్మించడంలో ముఖ్యoగా రాజకీయ పరమైన అంశాలను కవిత్వీకరించడంలో పరిణితి కనబడుతుంది.ఈ పరిణితి అధ్యయనం వలన వస్తుందా, పరిసరాలు  ప్రభావితం చేస్తాయా .తనముందు పరుచుకున్న జీవితం ద్వారా కవిగా రూపొందుతాడా అనే దానికి నాగరాజు వంటి కవులు చాలా ఉదాహరణలుగా నిలుస్తారు.
   

 నాగరాజు గ్రామీణ సoబoధాలనుండి రైతు లేదా రైతు కూలీ కుటు౦బం నుండి వచ్చాడు.అతను కవిగా రూపొందుతున్న కాలం ఆర్ధిక స౦స్కరణలు వేగవంతమౌతున్న దశ .రైతు చుట్టూ అల్లుకున్న వాణిజ్య క్రీడకు  కేవల౦ సేద్యం మాత్రమే కాదు ,దానిపై అధారపడిన  సమస్త వృత్తులు కునారిల్లుతున్న దశ.కవి ఈ విధ్వoసపు పునాదిపై పెరుగుతున్నాడు .ఈ రాపిడిని శక్తివంతంగా నాగరాజు కవితావరణలోకి తీసుకు రాగలిగాడు.కవికి  కావాల్సిన సామాగ్రి విస్తృతంగా సామాజిక ఆవరణలో పరుచుకొని ఉంది .అనేక శకలాలు హృదయ గతం అవుతున్నాయి ఇక్కడే  కవిగా  రూపొందుతున్న  కవికి ఒక మెళుకువ అవసరం .కాలం ,అణిచివేత ,విధ్వoస౦ కవిని తయారు చేశాయి.ఈ స్థల కాలాల నుండి కవిత్వాన్ని అంచనా వేయాలి. ఇది వానకు అంటరాని నేల చుట్టూ నదులు పారుతున్నా ఇక్కడ కరువు ప్రవహిస్తూ వుంటుంది , నాగరాజు కవిత్వ అంత సూత్రం ఇదే .కవిలో బహుళ  అస్టిత్వాలు వున్నాయి .కవిత్వ రచన కూడా వీటిపై ఆధార పడి వుంది .వీటన్నిటి వెనుక ఆర్ధిక౦ కీలకం .ఏవిషయం కవితా సృజనలో ప్రధాన భూమిక వహిస్తుంది.ప్రాంత,సామాజిక ,నేపధ్యం నుండి కవి ఊపిరి పోసుకున్న కాల యవనిక  నుండి   కవిత్వం  పట్ల  అంచనాకి రావాలి .అంతిమంగా వర్గ దృష్టి కవిలో అ౦తర్భాగం.నిజానికి కవి తన మూలాల దగ్గరే ఆగలేదు .తన స్థల ,కాలాలనుండి బయలుదేరి ప్రపంచాన్ని వెతికాడు. అవెతుకలాట లేకుంటే కవి విస్తరించడం ఆసాధ్య‌౦ .       ఆకలి శ్వాస విడిచే తాపుడైనా అతను అనుకోని వుంటాడు అరణ్యం కన్నాజనారణ్యమే అతి ప్రమాదమని ,కవి రెండు ప్రపంచాల మధ్య వున్న వ్యత్యాసాన్ని మాత్రమే చూడటం లేదు.జనారణ్యం కంటే అడవి మిన్న అని అనడ౦ వెనుక అర్ధం కూరత్వం  గురి౦చి కాదు .మనిషి తన మానవీయ తను కోల్పోయాడని చెప్పడమే .ఇది కవి ఉవాచ మాత్రమే కాదు. సాధారణీకరిచిన విషయం కూడా.
           

మా ఇళ్ళను ఖాళీ చేయాలని కూసేముందు ఎవరిళ్లను వాళ్ళు తగలబెట్టి రండి మీకిళ్ళు లేనప్పుడే తెలుస్తుంది ఇల్లు లేని మా బతుకులెలా  వుంటాయోఇల్లు ఖాళీ చేయడ మంటే అంత తేలిక కాదు.  ఇక్కడ కవి విస్తాపన గురించి  మాట్లాడుతున్నాడు .అభివృద్ది నమూనా లోని విధ‌౦స తీవ్రత గురించి మాట్లాడుతున్నాడు.జీవితం లోని సకల పార్శ్వాల‌ను తడుముతున్నాడు .ఇల్లు ఖాళీ చేయదమంటే .జీవితాన్ని ఖాళీ చేయడమే .కవి గొంతుక ఎక్కడ కనబడు తుంది నా కనురెప్పల కింద నన్నెప్పుడూ  వెంటాడే ముళ్లులాంటి కల చిత్రం     ఎండిపోయిన మాకయ్య బక్క చిక్కిన మా ఎద్దులు తుప్పు పట్టిన కాడి మడకనాయన కళ్ళనిండా ఉబుకుతున్న కన్నీళ్లు. కవి కవిత్వపు అజెండా ఇది . కవిగా కొన సాగడానికి కావాల్సిన లోపలి రుతువు ఇతని దగ్గర కాచుకొని వుంది.అతని చుట్టూ కవి ప్రపంచం వున్నది.ఒక వెతుకులాట వున్నది.తననుండి తర్జుమా అయ్యే కవిత్వ పరి భాష ఎలాను వుండనే వున్నది.అన్నిటికీమించి జీవితమున్నది. ఇప్పుడు మళ్ళీ అజంతా దగ్గృకి వద్దాం. .మనిషిని కేంద్రoగా చేసుకున్నాడు .దాని చుట్టూ వలయాన్ని అల్లుకున్నాడు.అతని కవితా శక్తి అతని నిర్మించుకున్న  సాలె గూడు. కావా లనే ఒక పరిధి దగ్గర ఆగాడు.ఊహ అనే పనిముట్టుతో కవిత్వాన్ని చెక్కాడు .అందుకే అతని కవిత్వం లో సాంద్రత ఇవాల్టికి కన్నీటి చెమ్మను కలిగిస్తుంది .కాలం గడిచినా కవి మనతో వున్నాడు. పల్లె పట్టు నాగరాజుకు విశాలమైన జీవితమున్నది.విధ్వoస మున్నది. కవిత ఈ నేపద్యా నికి ఆయువు పట్టు మాత్రమే కాదు. ఒక  పరిష్కారం కూడా . వస్తువు , శిల్పం కలగలిసిన కవితా ప్రయాణం మరింత నేర్పుతో నాగరాజు చేయాల్సి ఉంది. 

One thought on “అనేక అస్థిత్వాల కలనేత యాలై పూడ్చింది

  1. విలువైన సమీక్ష అందించినందుకు ధన్యవాదాలు సర్

Leave a Reply