సంభాషణ

బోనులో న్యాయ వ్య‌వ‌స్థ‌

స్టాన్ స్వామి హత్య చేయబడ్డాడు. హత్య చేసింది భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఇవ్వని కలిసి చేసిన హత్య ఇది. క్రూరమైన ఊపా చట్టాన్ని  ఆమోదించిన భారత  పార్లమెంటు దీనికి సాక్ష్యం. న్యాయాన్యాయాలు తేల్చే న్యాయవ్యవస్థ ఈ రోజు బోనులో నిలబడిడింది. న్యాయ వ్యవస్థ పైన, నల్ల చట్టాల పైన చర్చ జరగాల్సిన ఒక సందర్భం ముందుకు వచ్చింది. సమాజ పరిణామక్రమం ముందుకు వెళ్లే కొద్దీ ఆధునికంగా పనిచేయాల్సిన వ్యవస్థలు పాత, మధ్య యుగాల స్వ‌భావంతో  పనిచేస్తున్నాయి.ప్రొ.సాయిబాబు కేసు మొదలు నేడు రైతాంగ ఉద్యమాల్లో, సీఏఏ ఆందోళనకారుల అరెస్టుల వరకు కోర్టులవ్యవహరిస్తున్న తీరు అందుకు
సాహిత్యం కథలు

అధిపతి

అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. స్టూడియోలో అందరూ ఉత్కంఠతతో ఊపిరి బిగపట్టి ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. యాంకర్ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించాడు. స్టూడియో లో ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయు. యాంకర్ ఎదురుగా వున్న కుర్చీలో ఒక తెల్లని వెలుగు ప్రశాంతంగా కూర్చుని వుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ విధించకనే దేశంలోని విధులన్నీ నిర్మానుష్యం ఆయుపోయాయి. "మొదట, ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడగడానికి నన్ను అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియదు" యాంకర్ మొదలుపెట్టాడు."మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అనేక ప్రార్ధనల తర్వాత మా
కాలమ్స్ కవి నడిచిన దారి

స్వగతం

జీవితం మనది కాని దిశలో సాగుతున్నప్పుడు, అంతా నిరాకారంగా ఉంటుంది. ఆ  మలుపు దగ్గర నిలబడి మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. అలాంటి మలుపు ఒకటి నా జీవితంలో జరిగింది. అదే ఈ రోజున నన్ను మీ ముందిలా నిలబెట్టింది. ప్రకాశం జిల్లా నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఊళ్లలో మాది ఒకఊరు. సుంకేసుల గ్రామం. మా పూర్వీకులు అక్కడే నివసించారు.ఇప్పటికి మాఅన్నలు, బాబాయిలు అక్కడే జీవనం చేస్తున్నారు. మా నాన్నని వాళ్ళ మేనమామ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే తీసుకువచ్చి, కొలకలూరు బెంజిమెన్ గారి హాస్టల్లో చదివించి, రైల్వే లో
కాలమ్స్ ఆర్ధికం

ఎవ‌రి ఉద్దీపన?

కరోనా వ్యాధి మానవ జీవితాల్ని చిదిమి వేస్తున్నది. భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న భయం ఆందోళన కలిగిస్తున్నది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరం ఉన్నవారికి సాయం చేయడం, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా  పాలకుల ప్రాథమిక కర్తవ్యం. అందువల్ల కరోనా కష్టకాలం నుంచి ప్రజలను ఆదుకోవడం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. మానవతా దృష్టితో చూసినా ఈ సంక్షోభ సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలువడం అత్యంతావశ్యకం. యూరప్‌, అమెరికా వంటి దేశాల్లో ఆచరిస్తున్న విధానాన్ని సైతం పక్కన పడేసి నాటు వైద్య పద్ధతుల నాశ్రయించడం మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది.  కొవిడ్‌ వ్యాధిని నియంత్రించడంలో గానీ, బాధితులను