స్టాన్ స్వామి హత్య చేయబడ్డాడు. హత్య చేసింది భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఇవ్వని కలిసి చేసిన హత్య ఇది. క్రూరమైన ఊపా చట్టాన్ని  ఆమోదించిన భారత  పార్లమెంటు దీనికి సాక్ష్యం. న్యాయాన్యాయాలు తేల్చే న్యాయవ్యవస్థ ఈ రోజు బోనులో నిలబడిడింది. న్యాయ వ్యవస్థ పైన, నల్ల చట్టాల పైన చర్చ జరగాల్సిన ఒక సందర్భం ముందుకు వచ్చింది. సమాజ పరిణామక్రమం ముందుకు వెళ్లే కొద్దీ ఆధునికంగా పనిచేయాల్సిన వ్యవస్థలు పాత, మధ్య యుగాల స్వ‌భావంతో  పనిచేస్తున్నాయి.
ప్రొ.సాయిబాబు కేసు మొదలు నేడు రైతాంగ ఉద్యమాల్లో, సీఏఏ ఆందోళనకారుల అరెస్టుల వరకు కోర్టులవ్యవహరిస్తున్న తీరు అందుకు నిదర్శనం. ప్రభుత్వాలు తమకుగా ఆమోదయోగ్యం కానీ వారందరిని బంధించడానికి ఇప్పటికే అనేక చట్టాలు చేసింది. టాడా, పోటా చట్టాల వరుసలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. ఇప్పటి భాజపా ప్రభుత్వం దానిని మరింత కఠినతరం చేసింది. మనుషుల ఆలోచనలను, అసమ్మతిని అణగదొక్కడమే దీని ఉద్దేశం. 

స్టాన్ స్వామి అరెస్టు అయ్యే  నాటికే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. మంచి నీళ్లు తాగడానికి సిప్పర్ స్ట్రా ఆయనకి అవసరం. ఆయన్ను జైలుకు తరలించేప్పుడు అధికారులు దానిని అనుమంతించలేదు. దాని కోసం స్టెన్ స్వామి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. వారాలపాటు వాయిదాలతో కాలం గడిచిపోయింది. జైలులో ఆయనకు కోవిడ్ సోకినా కూడా అధికారులు పట్టించుకోలేదు. అప్పటికే తన సహా ముద్దాయిలు, జైలులో పనిచేసే అనేక మంది కోవిడ్ బారిన పడ్డారు. బెయిలు పిటిషన్ విచారణకు వచ్చే రోజునే శాతం స్వామి మరణించారు.  అంతకముందు ఆయనను ఆసుపత్రికి తరలించమని చెప్పిన జైలు అధికారులు, ఎన్ఐఏ తాత్సరంతో ఆయన ఆరోగ్యం మరింత పాడైంది. ఇదే విషయాన్ని అయన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక 84 ఏళ్ల వృద్ధిడికి ప్రపంచలోనే పెద్దది అయినా ప్రజాస్వామ్యం భయపడిన తీరుకి ఇది నిదర్సనం. 

2018 లో ఈ కేసు మహారాష్ట్రలో నమోదు అయింది. దీనిలో అరెస్టులు మొదలు అయినప్పుడే వీరందరిని దీర్ఘకాలిక నిర్బంధంలో భాజపా ప్రభుత్వం ఉంచాలనుకుంది. దీనికి ప్రధాని హత్యకు కుట్ర అనే ఒక కోణాన్ని జోడించారు . కేసు నమోదు అయ్యి మూడేళ్లు కావొస్తున్నా ఇంతవరకు విచారణ ప్రారంభం కాలేదు. వేలకొలది పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అందులో హత్యకు సంబంధించిన వివరాలు ఏమి లేవని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న అసలు ఉద్దేసం నానాటికి సంఘటితం అవుతున్న ఆదివాసీ, దళిత మైనారిటీ శక్తుల ఐక్యత అణిచివేత. వారికీ మద్దతుగా నిలుస్తున్న మేధావులు , ప్రజస్వామ్య గొంతులను అణచివేయడం ఈ చట్టాల ఉద్దేశం. ఇప్పటి వరకు ఈ కేసుల్లో మెజారిటీగా అరెస్టు అయినా వారంతా కూడా ప్రజల పక్షాన నిలబడ్డవారు.  

ఊపా కేసుల్లో అరెస్టు అయినా వాళ్లకు బెయిల్ ఎప్పుడు దొరుకుతుందో చెప్పలేని స్థితి. అనేక వేల మంది ఈ కేసుల్లో అక్రమంగా  నేరస్తులుగా చింత్రిచబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇప్పటి స్టాన్ స్వామి మరణం ఈ ప్రభుత్వాలకు ఒక అంకె మాత్రమే. ప్రతి ఏటా జరిగే జనన మరణాల సంఖ్యలో స్టాన్ స్వామి మరణం కూడా ఒక అంకెగా  మారిపోతుంది.  ఈ చట్టం పరిధిపై, పరిమితులపై సమాజం స్పందించాలి . ఇలాంటి చట్టాలు అసలు చేయాల్సిన  అవసరంపై మాట్లాడాలి. వీటిని పూర్తిగా రద్దు చేయాలిసిన అవసరాన్ని గుర్తురెగాలి.  లేకపోతే ఇలాంటి మ‌ర‌ణాల  సంఖ్య  పెరుగుతూనే ఉంటుంది.

Leave a Reply