వ్యాసాలు

రావణ కాష్టం – సోముని డప్పు

కా. నర్సన్న  స్మృతిలో... నర్సన్న గురించి రాయడమంటే దిగంబర కవులలో చెరబండరాజు గురించి రాయడం. అల్వాల్‌లో ఆరోజుల్లో మిలిటరీ సప్లయ్‌లలో పనిచేసిన కేరళకు చెందిన కుట్టి అనే విప్లవ సంస్కృతిలో ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి రాయడం. అల్వాల్‌కు పెంపకం వచ్చిన బి. నర్సింగరావు గురించి రాయడం. వీళ్లను ఒక చోటకు తెచ్చిన కె.ఎస్‌. గురించి రాయడం. వీరిలో నాకు తెలిసిన నర్సన్నకు అటు నర్సింగరావుతో, ఇటు చెరబండరాజుతో ఉన్న పరిచయాలు, స్నేహాలు - సంబంధాలు. వీళ్లంతా నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమంతో ప్రభావితమయిన వాళ్లు. వీళ్లలో నర్సింగరావు దిగంబర కవులతో కూడా ప్రభావితమయిన వాడు. నెహ్రూ భావజాలం ఉన్న