దేశ‌మంతా ఉపా విస్త‌రిస్తోంది. ఎవ‌రి మీదైనా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రి మీదికైనా ఎన్ఐఏ అనే ద‌ర్యాప్తు సంస్థ వెళ్ల‌వ‌చ్చు. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రుగుతున్న‌ది కాద‌ని, దీని వెనుక భార‌త రాజ‌కీయార్థిక వ్య‌వ‌స్థ‌లోని సంక్షోభాలు, ప్ర‌జా పోరాటాల ఒత్తిళ్లు  ఉన్నాయ‌ని, యుఏపీలే లాంటి పాసిస్టు చ‌ట్టాలు లేకుంటే భార‌త రాజ్యం మ‌నుగ‌డ సాధ్యం కాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింద‌ని పౌర‌హ‌క్కుల నాయ‌కుడు చిలుకా చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు. 


1) యుఏపీఏ చట్టం తీసుకుని రావటం వెనుక ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం ఏమిటి ?   


ప్రభుత్వాలు తమ రాజకీయ సుస్థిర‌త  కోసం చట్టాలను చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని దాచి కేవలం ప్రజాసంక్షేమం కోసమే,ప్రజల అభివృద్ధి కోస‌మే  చట్టాలు చేస్తున్నట్లు బుకాయిస్తాయి.1967 లో కూడా “ఉపా”చట్టాన్ని అందుకే తీసుకు వస్తున్నట్లు ఆనాటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఏంటి అ ఆభివృద్ధి అంటే  1)విచ్ఛిన్న‌కర శక్తుల నుండి దేశాన్ని రక్షించటం.2)దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం అనే  రెండు కారణాల రీత్యా ఈ చట్టాన్ని ఆనాడు తీసుకుని వ‌స్తున్న‌ట్లు  ప్ర‌జ‌ల‌కు చెప్పింది. దీంతో పాటు రహస్య ఎజండా ఏమంటే, ఆనాటికి పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో నగ్జల్బరి ప్రాంతంలో చైనా మార్గమే మ‌న మార్గ‌మ‌ని  మొద‌లైన‌ భారత విప్లవోద్యమం. దీన్ని అణివేయ‌డానికి  ఈ చట్టం తెచ్చారు. దీనికి  భారత రాజ్యాంగ మొదటి సవరణ ఆర్టికల్ 19 (1)(ఎ) కు పరిమితులు క్లాజ్ (2) విధిస్తూ గతంలో తీసుకువచ్చినది దోహదపడిందని చెప్పవచ్చు.ఈవిధంగా తమ ప్రభుత్వాన్ని సుస్థిర  పరచుకుంటూ ఆనాటి తమ విదేశాంగ విధానం పై ఎటువంటి విమర్శలు లేకుండా అణచివేతకు పాల్పడింది.స్వాతంత్రోద్యమ సమయంలో కలసి వచ్చే వివిధ జాతుల ప్రయోజనాలు కాపాడతామ‌ని  హమీ ఇచ్చిన భారతస్వాంతత్రోద్య‌మ‌ నాయకత్యం తొలుత ఆ ప‌ని  వాయిదాలు వేస్తూ తదుపరి ఇటువంటి చట్టాల ద్వారా అణచివేతకు పూనుకుంది.


2) గతంలో వచ్చిన నిర్భంధ చట్టాల కంటే యుఏపీఏ సంద‌ర్భాన్ని ఎలా విశ్లేషిస్తారు ?   


1967 లో ఈ చట్టాన్ని తీసుకుని వచ్చినా ప్రభుత్వాలు దీన్ని అంత‌గా వాడ‌లేదు. త‌ద‌నంతరం ఈ చట్టానికి సంబంధించిన సవరణలు ఒక పద్ధ‌తిలో  చేసుకుంటూ వ‌స్తున్నాయి. ప్రధానంగా జాతీయ భ‌ద్రతా సలహా మండలి లాంటిది ఏర్పాటు చేసుకుని అందులో వివిధ స్థాయి అధికారులను నియమించుకుని అయా ప్రభుత్వాలు త‌మ‌కు  అనుకూలమైన సిఫార్సు లను చొప్పించి సవరణలను చేస్తూముందుకు వ‌చ్చాయి. అందుకు అయా సంధర్భాల్లో జరిగిన ఘటనలను సాకుగా చూపింది.ఉదాహరణకు1984 లో జరిగిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య,  మరో ప్రధాని రాజీవ్ గాంధీ హత్య, 2002 లో భారత పార్లమెంట్ పై జరిగిన దాడి, ఆ త‌ర్వాత  జరిగిన ముంబైలోని అల్లర్లు వంటి కారణాల రీత్యా “టాడా” “పోటా”చట్టాలు కాలగర్భంలో ప్ర‌జా ఉద్య‌మాల వ‌ల్ల కలిసిపోయాయి. పాలకుల రాజకీయ అవసరాలు కూడా ప‌ని చేశాయి. అనంతరం 2004లో వచ్చిన యూపీఏ  ప్రభుత్వం వాటి స్థానంలో యుఏపీఏ చట్టాన్ని కొన్ని మార్పులు, చేర్పులతో తీసుకుని వచ్చింది. ఇదే చట్టాన్ని 2008 లో, 2012 లో మార్పులు చేర్పులు చేస్తూ మరింతగా కోరలు పదునెక్కించారు.దీన్ని  పార్లమెంటు లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిసారి “బాజపా” తన సంపూర్ణమైన మద్దత్తును తెలయజేస్తూ వచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ  ఆచితూచి వ్యవహరిస్తూ తనకు సంపూర్ణ మద్దతు పార్లమెంటు లో రాగానే దూకుడుగా వ్యవహరించింది.  2019 లో మరింత నిరంకుశ‌, నియంత్రుత్వ సవరణలను అందులోకి చొప్పించింది. 


3)భారత రాజ్య వ్యవస్థ సంక్షోభంలో పడినందువల్లే ఇటువంటి చట్టాలు అవసరం అవుతున్నాయనే పరిశీలన ఉంది! పౌరహక్కుల దృక్పథంలో మిరేమంటారు ?   

ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవసస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకులు దాన్నుండి బయటపడే ప్రయత్నాలు చేస్తారు.మనదేశంలో మాజీ ప్రధాని పి.వీ నరసింహారావుకు ముందు దేశం దివాల తీసిందని, బంగారం తాకట్టు పెట్టె దుస్థితిలోకి వ‌చ్చింద‌ని, అనంత‌రం పీవీ  తీసుకువచ్చిన ఆర్థిక  సంస్కరణలు ద్వారా దేశం గట్టెక్కిందని భావించేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటి ? ఆనాడు బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టారు!నేడు దేశంలో మూలమూలన ఉన్న కొండకోనల్ని సహితం కార్పొరేట్ కంపెనీలకు ధారాద‌త్తం చేస్తున్నారు. అనేక  ఒప్పందాలు వివిధ దేశాలతో కుదుర్చుకున్నారు. .అప్పటికి ఇప్పటికీ తలసరి భారతీయ పౌరుల‌ అప్పు పెరిగిందేకాని తరగలేదు.కార్పొరేట్ ఒప్పందాల కోసం మన దేశ  పర్యావరణాన్ని,పర్యావరణ చట్టాలను,”పీసా”చట్టాన్ని, అటవీ హక్కులచట్టాన్ని,భారత రాజ్యాంగం లోని 5 షెడ్యూలును పాలకులు తుంగలోకి తొక్కిపారేశారు.చట్టబద్ధ‌పాలన కోరుతూ  గొంతెత్తితే భారతరాజ్యంగంలోని ప్రాథ‌మిక హక్కైన భావవ్యక్తీకరణ హక్కును పాతరేయటానికి సవరణలు తీసుకొచ్చారు. నిబంధనల పేరిట యుఏపీఏ నిర్భంధ, నిరంకుశ చట్టాలను ప్రజల నెత్తిన రుద్దారు.

4)గతంలో ఉన్న చట్టాలకు ఈ చట్టానికి ఉన్న ప్రాథ‌మిక మైన తేడా, ప్రత్యేకత ఎంటి ? 

ఈ చ‌ట్టంలో మిగ‌తా వాటితో పోల్చితే కొన్ని ప్ర‌ధాన తేడాలు ఉన్నాయి.

1) ఇది నిర్ధిష్ట కాలపరిమితి తో ముగియదు.రద్దుచేసే వరకు ఉంటుంది. గతంలో ప్రభుత్వాలు చేసిన ఇటువంటి చట్టాలకు కాలపరిమితి ఉండేది. అవసరాన్ని బట్టి అయా ప్రభుత్వాలు పొడిగిస్తూ పోయేవి.అందుకే ఈచట్టం ఉన్నంతవరకు నిత్యం ఎమర్జెన్సీనే.

2) ఒక సంస్థను కాని,వ్యక్తిని దేశద్రోహి గా ప్రకటించవచ్చు. (ఇందుకు ప్రభుత్వం చెప్పేకుంటి సాకు ఒక సంస్థను నిషేదధిత సంస్థగా ప్రకటించిన వెంటనే అదే వ్యక్తి వేరొక సంస్థను ప్రారంభిస్తున్నార‌ట‌.  అదేవిధంగా వ్యక్తులు కలిస్తేనే సంఘం ఏర్పడుతుంది. కాబ‌ట్టి వ్యక్తులను కూడా దేశద్రోహులుగా ప్ర‌క‌టించ‌డానికి వీలుగా ఇందులో సవరణ చేశారు.

3)ఎటువంటి విచారణ జరగకుండా ఈ నేరం మోపినంతనే ఎవ‌రైనా నేర‌స్తులే. వాళ్లు నేను నేరం చేయలేదుఅని నిరూపించుకునేంత వరకూ.

4)శాంతి భద్రతలు రాష్ట్రలకు సంబ‌ధిచిన అంశమైనా దేశభ‌ద్రత పేరిట రాష్ట్రలతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)    జోక్యం చేసుకోవచ్చు. 

5) విచారణ జరపకుండానే జడ్జి గారు ముద్దాయి నేరం చేయలేదని భావిస్తేనే బెయిల్ మంజూరు చేస్తారు. 

6) దర్యాప్తు పేరిట సంవత్సరాల తరబడి జైల్లో గడిపి నిర్దోషీగా బయట పడినా దాన్ని   నష్టవిషయంగా ప్రస్తావించదు.

7)ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అంటే ఇందులో అర్థం ఏమీ లేదు. అలాంటి నిర్వచ‌నం లేదు.  అంటే విమర్శ,నిరసన,భావాలు కలిగి ఉండటం ఈ చట్టం క్రింద నేరాలుగా నమోదు చేయటానికి అవకాశం కల్పించారు. ఇక పౌరులు త‌మ  ప్రాథ‌మిక హక్కైన ఆర్టికల్ 19(1)a భావవ్యక్తీకరణ స్వేచ్ఛ‌ను కోల్పోతారు. దేశం లో ఆర్థిక  సంస్కరణల ఉధృతిని సాగించ‌డానికి ఈ  చట్టాన్ని పాల‌కులు వాడుకుంటున్నారు. ఆ ర‌కంగా భారీ ఎత్తున దీన్ని అమ‌లులోకి తీసుకొస్తున్నారు. ఈ చ‌ట్టం లేకుంటే రాజ్యానికి మ‌నుగ‌డ లేని స్థితి ఏర్ప‌డింది. 
 


5) దేశవ్యాప్తంగా వందలాది కేసులు నమోదయ్యాయి. వాటిలో వైవిధ్యం  ఏమైనా ఉందా ?   
 

వైవిధ్యమైనవి ఉన్నాయి. చాలా వ‌ర‌కు ఎలాంటి నేరమే జరగని చోట నేరాలు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ముద్దాయిలు అవుతున్నారు.  దీనికి వాళ్లూ వీళ్ల‌నే  తేడాలేదు.విప్లవకారులతో మొదలై జర్నలిస్టులు,రచయితలు,చిత్రకారులు, గాయకులు,హక్కుల కార్యకర్తలు,రాజకీయ నాయకుల దాకా ఈ చ‌ట్టం వచ్చింది. అన్ని కేసులలో సారూప్యత ఏమంటే ప్ర‌శ్న‌ను స‌హించ‌లేక‌పోవ‌డం. ఎవ‌రు ప్ర‌శ్నిస్తే, నిర‌స‌న తెలిపితే, విమ‌ర్శిస్తే వాళ్లు ఏ రంగం వారైనా కేసులు నమోదౌతున్నాయి. పేద‌ల గురించి, అణ‌గారిన స‌మూహాల గురించి మాట్లాడేవారి  మీద‌, నేరుగా ఆ ప్ర‌జ‌ల‌పైనా నమోదు అవుతున్నాయి.ప్రధానంగా సమాజంలో మౌలిక మార్పులు కోరుకునే ఉద్య‌కారులపైన పెద్ద ఎత్తున ఉపా కేపు పెడుతున్నారు. అంటే బూటకపు ఎదరుకాల్పులలో చనిపోకుండా మిగిలిన వారిపై, అ ఉద్యమాలు సరైన‌వే అని  మాట్లాడే వారిపై,ఉద్యమాల పై జరిగే హింసను ఖండిస్తున్న వారిపై,  సామాజిక న్యాయం కోరినా,చట్టబద్ధ‌పాలనను కోరినా ఉపా కేసు న‌మోదు చేస్తున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలను ఎత్తిచూపేవారిపై అధికంగానే నమోదు అవతున్నాయి.


 6) దేశవ్యాప్తంగా వందలాది కేసులు నమోదయ్యాయి. వాటిలో వైవిధ్యం  ఏమైనా ఉన్నాయా ? 
   

వైవిధ్యమైనవి ఉన్నాయి. నేరమే జరగని చోట నేరాలు నమోదు కాబడినాయి.ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ముద్దాయిలు కాబడ్డారు.అందుకు వీరువారని తేడాలేదు.విప్లవకారులతో మొదలై జర్నలిస్టులు,రచయతలు,చిత్రకారులు, గాయకులు,హక్కుల కార్యకర్తలు,రాజకీయ నాయకుల దాకా వచ్చింది. అన్ని కేసులలో సారుప్యత మాత్రం ప్రశ్నించేవారి పైన,విమర్శ ,నిరసన తెలపే వారిపై. వారే రంగం వారైనా కేసులు నమోదౌతున్నాయి.అయితే ఆకేసులన్ని పేదవర్గాలవారి పై,అ వర్గాల గూర్చి మాట్లాడే వారిపై నమోదు అవతున్నాయి.ప్రధానంగా సమాజంలో మౌలిక మార్పులు కోరుకునే ఉధ్యమకారులపై అంటే బూటకపు ఎదరుకాల్పులలో చనిపోకుండా మిగిలిన వారిపై,అ ఉద్యమాలు సరైనవని మాట్లాడే వారిపై,ఉద్యమాల పై జరిగే హింసను ఖంఢిస్తూన్నా,సమన్యాయం కోరినా,చట్టబద్దపాలనను కోరినా ఈ కేసులు నమోదు చేస్తూన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారిపై అధికంగానే నమోదు అవతున్నాయి.


7) ఉపా కేసుల్లో న్యాయ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ? 
 

నత్తనడక నడుస్తోంది. అన్యాయం గా, దుర్మార్గంగా, నూటికి 90 శాతం దర్యాప్తు  సంస్థ‌ల‌కు అనుకూలంగా,ప్రభుత్వాలకు అనుకూలంగా న్యాయస్థానాలు నడుచుకుంటున్నాయి.దీంతో అత్యధిక శాతం పేదలు సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు.ఇక్కడ అడవికి, పల్లెకు,పట్టణానికి, చదువరికి, చదువు లేని వారికి మధ్య‌ న్యాయం పొందటంలో తేడా ఉంది.ఉత్తరాదికి,దక్షిణాదికీ మధ్య‌ కోర్టుల్లో న్యాయం అందటంలో తేడా ఉంది.


8) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఇటీవల యుఏపీఏ కేసులలో బెయిల్స్ రావ‌డం ప్ర‌జాస్వామిక పోరాటాల  విజయంగా భావించవచ్చా ?   
   

చాలా ఉపా కేసుల్లో ఇంతకు ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రలలో బెయిళ్ళు కోర్టులు మంజూర‌య్యాయి.  అడపాదడపా కేసులు విచారణ కూడా జరుగుతున్నాయి.ఆంధ్ర‌ప్రదేశ్ లో ప్రధానంగా 30 నుండి 40 మంది వరకు “తీవ్రమైన చర్యలు నిందితుల‌పై  తీసుకోవద్దు”అనే ఆర్డర్ కోర్టు ఇచ్చింది.  హైకోర్టులో జ‌రిగిన ఈ కృషిలో ప్రజాస్వామిక ఆలోచనాపరులైన  ఇందులో హైకోర్టు న్యాయవాదులు ఎంద‌రో పాల్గొన్నారు. వారి స‌హ‌కారంతోనే, స‌మ‌ష్టి కృషితోనే కొన్ని విజ‌యాలు న్యాయ ప్ర‌క్రియ‌లో సాధ్య‌మైంది.. ప్రధానంగా ఉపా కేసులు రెండు రకాలుగా ఉంటాయి.ఒకటి ఎన్ఐఏ  దర్యాప్తు స్వీకరించినవి.రెండు సాధారణ పోలీసులు దర్యాప్తు చెసేవి.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసంఘాల బాధ్యులపై నమోదైన కేసులు పెట్టుడు కేసులే. ఇటువంటి వాటిని ఎన్ఐఏ  లాంటి దర్యాప్తు సంస్థ చేప‌డుతోంటే  ఇక దేశవ్యాప్తంగా అ  సంస్థ  చేపట్టిన కేసులు ఎంత బూటకమైనవో మనం అర్ధం చేసుకోవచ్చు.కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్న కొద్ది  ఎన్ఐఏ డొల్లతనం ప్రజలకు అర్ధమైతోంది. వ్యతిరేకత పెరుగుతోంది.  ఈ వ్యతిరేకత వ‌ల్లే, తప్పుడు కేసుల సంఖ్యను బట్టి ప్రజలలో “ఉపాష ను రద్దు చేయాలనే ఉద్యమం బలపడుతుంది. ఇటువంటి చట్టాలు ఎక్కువ కాలం మనదేశంలో మనగలగ లేవు.అయితే తొలినాళ్ళలో ప్రజాసంఘాల బాధ్యులు కొంత ఇబ్బందులను ఎదుర్కోక‌ తప్పదు.

Leave a Reply