ఆర్ధికం

జిడిపి పెరిగినా.. మారని బతుకులు

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అభివృద్ధి నినాదాలు, ప్రజాకర్షణ వాగ్దానాల ప్రచార పటాటోపం తప్ప ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది శూన్యం. అందులో భాగంగానే దేశంలో ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఉద్యోగ, ఉపాధి కల్పన కొత్త పుంతలు దొక్కుతోంది. ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయి. ఇవి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలుకుతున్న ప్రగల్భాలు. ప్రధాని మోడీ వల్లెవేస్తున్న ‘వికసిత భారత్‌’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ఈ కఠోర నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ తాజా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)తో బహిర్గతమైంది. 2023 అక్టోబర్‌లో నిరుద్యోగిత రేట్‌ 10
సమీక్షలు

రెప్పవాల్చని చూపు          

 'అట్టడుగున అందరమూ మానవులమే' అన్న కవి మాటల్లో జీవశాస్త్రపరమైన అర్ధానికి మించిన సామాజిక మానవసారం ఇమిడి ఉంది. అటువంటి ప్రాకృతిక మానవసారంతో తొణికి సలాడే మనిషి కేంద్రంగా రాసిన కవిత్వమే మిత్రుడు ఎన్. వేణుగోపాల్ 'రెప్పవాల్చని కాపలా'.  మరి కవి వేణుగోపాల్ పావురపడే మనిషి ఎవరు? ఆ మనిషి అతడు కావచ్చు. ఆమె కావచ్చు. మరి అతడు/ ఆమె కేవలం ఒక్క వ్యక్తేనా? కానే కాదు. మనిషి అస్తిత్వానికి ఏకరూపం లేదు. బహు రూపాలు ఉన్నాయి. అనంతమైన భిన్నత్వం ఉంది. కనుక సహజంగానే మనిషి ఆలోచనలోను, ఆచరణలోనూ అటువంటి విభిన్నత్వమే ఉంటుందని ఈ కవి భావిస్తాడు. అయితే ఆయనకు
వ్యాసాలు

అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు: ప్రజాస్వామ్యం ఎక్కడ?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు  జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ   నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్-ఎఫ్ఆర్ఎ), ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. "పరిరక్షణ" అనే
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
వ్యాసాలు

బ్రాహ్మణీయ హిందుత్వ సాధనాలు  ద్వేషం, భయం, పెత్తనం, హింస

(త్వరలో విడుదల కానున్న పాణి వ్యాసాల సంపుటి ద్వేషభక్తి కి రాసిన ముందుమాట) గత పదేండ్ల హిందుత్వ పాలనను చీకటి కాలంగా గుర్తించడం మామూలు విషయమయ్యింది. నిజమే, చీకటి అలుముకుంటుంది, కాని వాస్తవానికి చీకటి లేనిదెప్పుడు? అయితే చీకటి ఎప్పుడూ వుండేదే కదా అనుకుంటే  ఇప్పుడు మరింత  గాఢంగా మారుతున్న చీకటికి ఎటువంటి ప్రత్యేకత లేదా అనే మరో ప్రశ్న వస్తుంది. అసలు చీకటి, వెలుగులతో మాత్రమే సంక్లిష్టమైన కాలాన్ని, సమాజ చలనాన్ని, అందులోని సంఘర్షణలను అంచనా వేయగలమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చీకటి, వెలుగులను విశాల సామాజిక, రాజకీయార్థిక అవగాహనతో చారిత్రకంగా అంచనా వేయాల్సివుంటుంది.