వ్యాసాలు

అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు: ప్రజాస్వామ్యం ఎక్కడ?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు  జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ   నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్-ఎఫ్ఆర్ఎ), ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. "పరిరక్షణ" అనే