ఆజాద్‍కు అశ్రునివాళిగా…
ఈ ఏడాది విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి. ఆయన శత జయంతి (జూలై 23, 2006)ని పురస్కరించుకుని పుస్తకం తీసుకురావాలని నిర్మలానంద ప్రయత్నించారు. పుస్తకం వెలువరించకుండానే వెళ్ళిపోయారు. ఆ బాధ్యతను ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాం. ఇందులో ప్రచురించిన వ్యాసాల్లో కొన్ని తెలుగు మాస, దిన పత్రికల్లో వచ్చినవే. రకరకాల కారణాల వల్ల పుస్తక రూపంలో రావడానికి 20 ఏళ్లు పట్టింది. 1970ల నుంచే భారతీయ విప్లవకారుల గురించి వ్యాసాలు, పుస్తకాలు సేకరించే అలవాటున్న నిర్మలానందగారికి, చంద్రశేఖర్ ఆజాద్ వివరాల సేకరణకు చాలా ఏళ్లు పట్టింది. బహుశా ఆజాద్ అజ్ఞాత జీవితమే అందుకు కారణం. మన మధ్య









