బస్తర్లో భారత ప్రభుత్వ ఉక్కుపాదం
600కి పైగా హత్యలు, అరెస్టులు: గనుల తవ్వకం బస్తర్లో భారత ప్రభుత్వ ఉక్కుపాదం అడవి మౌనంగా ఉంది కానీ ఆ మౌనంలో నరికివేతకు గురైన వేలాది చెట్ల హాహాకారాల సమాధి – లాపతా జంగిల్, సుధీర్ ధవాలే 'ఆపరేషన్ కగార్' పైన తమ తాజా నివేదికను 2026 జూన్ 11నాడు, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ విడుదల చేసింది. 2024 జనవరి నుండి 2026 మార్చి మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన భద్రతా చర్యల సమాహారమే ఈ ఆపరేషన్ కగార్. ఈ పదానికి అర్థం ఏదైనా ఒక అంచుకు కుదించడం. ప్రధానంగా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో 'నక్సలిజం' లేదా










