అడవి – రోడ్డు
అడవిమీద రోడ్డు దండయాత్ర చేస్తున్నది అడవిని రోడ్డు ఆక్రమించుకుంటున్నది మట్టిని, చెట్టును, ఆకును, పుప్వును, నీటిని పుట్టను, పిట్టను, గుహను, గూటిని గుట్టను, లోయను తొలిచేస్తూ రోడ్డు పొక్లెయినర్‌లా వస్తున్నది కొండచిలువతో కూడ పోల్చలేము కొండచిలువ నుంచి పిల్లల్ని, వృద్ధుల్ని, తనను రక్షించుకోవడం అనాదిగా ఆదివాసీకి తెలుసు రోడ్డు బాటల్ని రద్దుచేస్తూ వస్తున్నది మనిషి పాదాలకింద మట్టిని డాంబర్‌తో సిమెంటుతో కప్పేస్తూ వస్తున్నది ఇసుకదాహంతో వస్తున్నది ఇనుము దాహంతో వస్తున్నది ఇంధనం దాహంతో వస్తున్నది ఖనిజదాహంతో వస్తున్నది ఎదుటివాని దప్పిక ఏమిటో ఆదివాసీకి తెలుసు పసిపాపకు చన్నుకుడిపిన అడవితల్లికి తెలుసు ఆవుపాలు దూడకోసమే అనుకునే ఆదివాసికి తెలుసు కడుపుకి