చీకటి రోజుల్లో గానాలుండవా…..
1818 దీర్ఘ కావ్యంపై సామాజిక సాంస్కృతిక విశ్లేషణ శ్రీరామ్ పుప్పాల 1818 దీర్ఘ కవిత రాత ప్రతి దశ నుంచి అచ్చు పుస్తకం వరకు ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారీ నాకు మరింత లోతైన అర్థం తోచేది. ప్రతి చరణమూ ఒక సంఘటననో, చరిత్రలోని కీలక పరిణామాన్నో గుర్తుచేసేది. మన దేశ ప్రజల పోరాటాలను, హక్కుల హననాన్నీ ఒక క్రమంలో రికార్డు చేసిన రచన ఇది. తనలో తాను మాట్లాడుకుంటూ, మనతో మాట్లాడుతూ భీమానది ఒక విస్మృత చరిత్రను పరిచయం చేస్తున్నది. నదులు నాగరికతా చిహ్నాలు. నదుల వెంట జనావాసాలు ఏర్పడి స్థిర వ్యవసాయం సమకూరే క్రమంలో ఉత్పత్తి సాధనాలు,