కొత్త పుస్తకం

కొత్త పాఠం

50 ఏళ్ల విరసం మహాసభల్లో కలిసిన ఒక ట్రాన్స్‌ సామాజిక కార్యకర్తతో ఒక రాత్రంతా జరిపిన సంభాషణ, అంతకు ముందే జరిగిన హైదరాబాద్‌ ప్రైడ్‌ మార్చ్‌, అడపాదడపా బిట్టూతో పంచుకున్న విషయాలు కొత్త లోకంలోకి తలుపులు తెరిచాయి. అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలని నిర్దేశించే సామాజిక నీతి పట్ల చికాకు, జెండర్‌ స్టీరియోటైప్‌కు భిన్నంగా ఉండే వ్యక్తుల పట్ల ఆసక్తి నా రాజకీయ అవగాహనతో సంబంధం లేకుండా మొదటి నుండీ ఉండేవి. మార్క్సిజం పరిచయమయ్యాక మానవ సంబంధాలను అర్థం చేసుకునే తీరు తెలిసింది. ఒక ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థం కావు.
వ్యాసాలు

రాజకీయార్థిక విధానం-బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం

బ్రాహ్మణీయ హిందూత్వ పుట్టుకకు అర్థభూస్వామ్య అర్థవలస సామాజిక ఆర్థిక వ్యవస్థే పునాది. పెటీబూర్జువా ఫాసిజం కన్నా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం భిన్నమైనది. ఇది కులవ్యవస్థను నూతన రూపంలో బలోపేతం చేసే భూస్వామ్యతరహా ఫాసిజం. హిందూత్వ అంటే, రూపంలోనూ సారంలోనూ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉండే హిందూమతంలో ఏకరూపతను సాధించడం. భారత సమాజంలోని ప్రత్యక్ష, పరోక్ష వైరుధ్యాల ఫలితంగా ఏర్పడిన భౌతిక పునాదే పై కేంద్రీకరణను ఉత్పన్నం చేస్తుంది. సామాజిక నిర్మితిని సామాజిక, ఆర్థిక సంబంధాల రూపవ్యక్తీకరణే హిందూ సామాజిక నిర్మాణం. కాబట్టి హిందూత్వ ఫాసిజపు పుట్టుకను, పెరుగుదలను అర్థం చేసుకోవాలంటే దాన్ని సృష్టించిన భౌతిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి.
ఆర్ధికం

ప్రజా వ్యతిరేక బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం వంటి పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులను ఊతమిచ్చే విధంగా ఉంది. బడ్జెట్‌ అంటే ప్రభుత్వ ఆదాయ-వ్యయాల చిట్టా మాత్రమే కాదు. దానికి ఒక తాత్విక చింతన ఉండాలి. ఆదాయం ఎవరి నుంచి వస్తుంది, వ్యయం ఎవరి కోసం చేస్తున్నారనేది బడ్జెట్‌లో కీలకాంశం. ప్రధానంగా దేశ ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఏలా అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. కాని మన పాలకులకు ప్రజలు కనిపించడం
కొత్త పుస్తకం

జీవితానుభవాన్ని ఎర్రజెండాలా ఎగరేసిన కవిత్వం

రాజకీయ కవితలు రాయడం చాలా కష్టం. అందులోనూ కమ్యూనిజం లేదా ఇప్పుడు పాలకులు పదేపదే  ఉఛ్ఛరిస్తున్న అర్బన్ నక్సల్ అవగాహనతో కవిత్వం రాయడం ఇంకా కష్టం. ఇలాంటి కవిత్వం లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి. నేరుగా ప్రజాపోరాటాలతో, జనజీవితంతో సంబంధం ఉండడమూ, వాటి రూప సారాలను మార్క్సిజం ఆధారంగా అర్థం చేసుకునే చారిత్రక అవగాహన కలిగి ఉండడమూ. నేను చూసిన, పరిచయమున్న ఇలాంటి పెద్దలలో అరుణ్ సార్ ఒకరు.            తాను నమ్మిన విప్లవ పంధా నుంచి, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఇసుమంత కూడా పక్కకు ఒరగని నేపధ్యం నుంచి ఎలాంటి కవిత్వం ఆశించగలమో అలాంటి
వ్యాసాలు

స్టాలిన్-  ఫాసిస్టు వ్యతిరేక అవగాహన

ఫాసిజం అనే పదం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి వున్నది. ఈ పార్టీని మొదటగా ముసోలిని ఇటలీలో ప్రారంభించాడు. హిట్లర్ జర్మనీలో ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకారిగా పరిణమించిన రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారు. వీరి కూటమిని ఓడించేందుకు ప్రపంచమంతా ఒకటయింది , ఆ మహా కూటమిలో ప్రత్యర్థి వ్యవస్థలైన సోవియెట్ వ్యవస్థ,పెట్టుబడిదారీ వ్యవస్థ తాత్కాలికంగానైనా ఒక్కటయినాయి. ఆ ఐక్యసంఘటన ఏర్పడకపోతే ప్రపంచం ఏమైపోయేదో ఆలోచించలేము. పెట్టుబడిదారీ దేశాల వైపునుండి ఆలోచిస్తే ఆ కూటమే వారిని వినాశనం నుండి రక్షించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ ప్రజలదే అసమాన త్యాగం. ప్రారంభంలో హిట్లర్
వ్యాసాలు

ఫాసిస్టు యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మార్చిన స్టాలిన్‌

దేశభక్తి గల ఒక ఎన్‌ఆర్‌ఐ బంధువు స్టాలిన్‌ గురించి సులభంగా అర్థమయ్యే పద్ధతిలో నానుంచి జవాబు ఆశించాడు. స్టాలిన్‌ నాయకత్వమూ, రెండవ ప్రపంచయుద్ధంలో రెండుకోట్లమంది రష్యన్‌ ప్రజల ప్రాణత్యాగాలే లేకపోతే పాశ్చాత్యదేశాల  సోకాల్డ్‌  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఫాసిజం నుంచి బతికి బయటపడేది కాదని జవాబిచ్చాను. స్టాలిన్‌ నాయకత్వం అన్నపుడు - అందులో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌పార్టీ మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి శ్రామికవర్గ విప్లవాన్ని విజయవంతం చేసిన చరిత్ర ఉన్నది. ఆ విప్లవ విజయకాలం నుంచి (అక్టోబర్‌ 1917) విప్లవంలోనూ, ఆ తర్వాతకాలంలో లెనిన్‌ నాయకత్వంలో 1923 దాకా సోషలిస్టు నిర్మాణాలకు వచ్చిన అవరోధాలను పరిష్కరించిన చరిత్ర