కథలు

ఎకనమిక్స్‌

వారం కింద. ఒకరోజు.  ఉదయం ఇంటర్వెల్‌ అయిపోయింది. అంతా ఎవరి క్లాసులకు వాళ్ళం పోతున్నాం. నేను టెన్త్‌ క్లాస్‌  గదిలోకి వెళ్ళాను. సెంటు వాసన గుప్పు మంటోంది. బోర్డువైపు చూశాను. ఇంగ్లీష్‌ టీచర్‌ ఆరోజు థాట్‌ ఫర్‌ ది డే ఇలా రాశారు. If  you light a lamp for someone elseIt  will also brighten your own path బోర్డు తుడుస్తూ ఆలోచిస్తున్నాను. ఎకనామిక్స్‌లో కొంచెం కవర్‌ చేద్దామనుకున్నాను. బోర్డువైపు తిరిగి  టాపిక్‌ రాసేంతలో  కిరణ్‌ కంప్లయింట్‌ ‘‘మేడం, మేడం శ్రావణ్‌ సెంటు తెచ్చాడు’’             కంప్లయిట్స్‌ పర్వం మొదలైౖంది. రఘు కూడా తెచ్చాడు,
కవిత్వం

అనిశ్చయం

రాత్రి నేను ప్రార్ధించేసమయంలో తోడెళ్ళు యోనిని గాయపరుస్తాయి లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది వైద్యం కరెన్సీ పడక మీద నిద్దురపోతుంది ఆకలి బాధ గడ్డకట్టుకపోయి నిశ్చలమవుతుంది అప్పులనీడ ఊరితాడై కుటుంబాన్ని జనాభా లెక్కల నుంచి వేరుచేస్తుంది పేద , మధ్యతరగతి మనుషులు సగం రాత్రి చచ్చి మిగతా సగం పగలు చావడానికి దేహాల్ని దాచుకుంటారు భద్రత లేని లోకంలో పండుముఖాలు నిరాశ శూన్యాలై లోలోన గొణుక్కుంటూ ఉంటాయి ఎక్కడో పసినిద్ర ఉలిక్కిపడుతుంది భ్రమల్లో బతుకుతోన్న ఆశలు కోడినిద్దురతో కుస్తీ పడుతుంటాయి.
కొత్త పుస్తకం

రాయలసీమ ‘సాధన’ నవల

రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత  అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ.  ఇది వరకు చారిత్రక నవలలు, మనో  వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్‌ ఉంచారు.             కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు

1ఓ యుద్ధ ప్రకటన చుట్టూ గోడలపై వున్న అక్షరాలన్నీ ఏకమై మరో కొత్త యుద్ధాన్ని ప్రకటించినట్లు మూలకున్న ముసలవ్వలా ఆ పాత గొంగడి ఎర్రగుడ్డ నా భుజాన్ని తట్టి ముందుకు నడిపినట్లు నాలోని కటిక చీకటికి ఎడిసన్ బల్బులు ప్రపంచాన్ని వెలిగించమని సైగ చేసినట్లు కాలువలై పారుతున్న నా కన్నీళ్ళను తుడవడానికి ఆ పాత పుస్తకాలే కదా! మరో కొత్త మార్గాన్ని చూపించే సన్నిహితులు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేశమంతా మతపిచ్చితో మారణహోమంలో మునిగిపోతుంటే మరెంత కాలం.... ఆ నాలుగు గోడల మధ్య స్వప్నపు కాంతులంటూ కలలు కంటావ్? లే.......! ఆ చీకటి ప్రపంచంలో నుండి బయటికి రా....
వ్యాసాలు

ఫాసిజం గురించి ఎన్నికల పార్టీలకు తెలుసా ?

గత సంవత్సరం ఒక--ఆన్ లైన్ పత్రికలో - ఆర్ ఎస్ ఎస్ ప్రారంభానికి ముందు మూంజే ఇటలీ పర్యటన, అక్కడి నుండి వచ్చి నాగపూర్ వెళ్ళి హెడ్గెవార్ ను కలవడం గురించి రాశారు. ఇండియాలో ఆర్ ఎస్ ఎస్ మూలాల పైన  ఇర్ఫాన్ హబీబ్ లేదా షంసుల్ ఇస్లాం వంటి వారి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. బీజేపీ రాజకీయ నాయకులు తరుచుగా తమది సైద్ధాంతిక సంస్థ అనీ చెప్పుకుంటూ ఉంటారు . ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంస్థలు సంపూర్ణ ఆధిపత్యంతో పురోగమిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు రాజకీయాలను, దాని ఫాసిస్టు సైద్ధాంతిక
వ్యాసాలు

పాట పాడితే నోటీస్‌

‘యిళ్ల నుంచి వెళ్లగొట్టడంపై పాట పాడినందుకు యూపీ పోలీసు నోటీసు యివ్వడం సరైనదా కాదా అని ప్రజలు నిర్ణయించాలని కోరుకుంటున్నాను’ - నేహా సింగ్‌ రాథోడ్‌ ఉత్తర ప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వెనుక ఉన్న రాజకీయాలు బుల్డోజర్‌ సంస్కృతిగా దేశవ్యాప్త ప్రచారమైంది. అలాంటి ఒక ఘటనపై భోజ్‌పురి ప్రసిద్ధ జానపద గాయని నేహా సింగ్‌ రాథోడ్‌ (24సం)కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆమె రాజకీయ స్పృహతో జానపద పాటలు పాడే  గాయని.             ఫిబ్రవరి 15న కాన్పూర్‌ (రూరల్)లోని మదౌలీ గ్రామంలో ఆక్రమణల వ్యతిరేక చర్యలో 44 ఏళ్ల ప్రమీలా దీక్షిత్‌,  19 ఏళ్ల ఆమె కుమార్తె సజీవ
సమీక్షలు

జైలుగోడలపై రాసిన ప్రశ్నలే..‘‘ప్రేమతో మీ సుధ’’

‘‘ఇక మాటలు అనవసరం, కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం, విప్లవాత్మక దృక్పథంతో రచనలు చేయాలి’’ - శ్రీశ్రీ (8.10.1970 విరసం రాష్ట్ర మహాసభలు-ఖమ్మం) ఇప్పటివరకు అటువంటి మాటలు వింటూనే ఉన్నాం. కార్యశూరత్వం చూపటంలేదు. అసలు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే కవులే పలచబడుతున్నారు. మరి ఎవరు మట్లాడాలి. మాట్లాడుతున్నది అతి తక్కువమందే కావచ్చు..కానీ మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే..ప్రశ్నించకపోతే..గొంతెత్తి రణన్నినాదం చేయకపోతే రాజ్యం చేసే క్రూరత్వం రెట్టింపవుతుంది. ఇవాళ దేశంలో స్త్రీలు, దళితులు ఆర్థిక రాజకీయ దోపిడీలకు గురౌతున్నారు. డెబ్బై ఏళ్ళు దాటిన ముసలిభారతంలో సాంఘిక అణచివేత ఇప్పటికీ కొనసాగుతున్న పరంపరే. ఆర్థికదోపిడీ వల్ల పేదమధ్యతరగతి జీవితాలు దుర్భరమైపోతున్నా ప్రశ్నించకూడదా..? హక్కులకై కలబడకూడదా..? 
కొత్త పుస్తకం

విప్లవ చారిత్రక నవల

‘‘తమ తిరుగుబాటు ఒక జార్‌ని దించేసి మరో జార్‌ని, లేదా మరో పాలకుడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు. ఒక మహాలక్ష్యం కోసం ఉద్దేశించినది’’సెర్గీమాట The secret of beauty is the secret of life. The beauty of life is the beauty of struggle. (Y. Borev : Aesthetics, p.44& 46)(జీవిత రహస్యమే సౌందర్య రహస్యం. సంఘర్షణ సౌందర్యమే జీవిత సౌందర్యం) జీవితం, సంఘర్షణ, సౌందర్యం - ఇవి ఒక విడదీయరాని త్రయం. రచయిత నాగభూషణ్‌  రచించిన బృహన్నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఒక చారిత్రక నవల. ఒక ఉద్యమ చరిత్రను ప్రతిబింబించిన
వ్యాసాలు

ఫాసిజానికి వ్యతిరేకంగా స్టాలిన్

ఫాసిజం పుట్టుకను అర్థం చేసుకోవాలంటే ముందు పెట్టుబడిదారీ విధానం ఏ దశల గుండా ప్రయాణించినదీ తెలుసుకోవాలి.   పెట్టుబడిదారీ విధానానికి రెండు దశలున్నాయి:  స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ  అయిన గుత్త పెట్టుబడిదారీ విధానం. స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారులు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా పోటీ పడుతూ ఉత్పత్తి చేస్తుంటారు. ఈ పోటీలో కొంతమంది వెనుకబడిపోతారు, కొంతమంది నాశనమైపోతారు. మరికొంతమంది క్రమంగా సంపదలను కూడబెట్టి గుత్త పెట్టుబడిదారులుగా ఎదుగుతారు. ఈ విధంగా పెట్టుబడిదారీ విధానం క్రమంగా అభివృద్ధి చెందుతూ తన అత్యున్నత దశ అయిన సామ్రాజ్యవాద దశను చేరుకుంటుంది.20వ
వ్యాసాలు

ప్రజలపై యుద్ధం – రిపబ్లిక్‌ తన పిల్లలను తానే చంపుకుంటున్నది

రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, దాన్ని విలువలేని దానిగా మార్చివేస్తూ రాజ్యాంగాన్ని విశ్వసించని వాళ్ళని మాత్రం నేరస్తులుగా పరిగణించే స్థితికి ప్రజాస్వామిక వ్యవస్థ దిగజారిపోయింది. రాజ్యాంగం గురించి ప్రజల్లి మాట్లాడకుండా చేయడమే కాదు, మాట్లాడిన వాళ్ళందరిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తూ అవసరం అనుకుంటూ అర్బన్‌ నక్సల్‌గా ప్రకటించే సంస్కృతి కొనసాగుతుంది. ప్రజా పోరటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్ని కేవలం చట్టాల వరకే పరిమితం అయ్యాయి. ఆచరణ అంతా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థ నడవాలనే స్థితిలో నేరస్తులే దొరలుగా కీర్తించబడుతున్నారు. న్యాయం కోసం నిలబడ్డవారు నక్సలైట్‌గా ముద్రవేసుకోబడి కాల్చివేయబడుతున్నారు. ప్రజా