వ్యాసాలు

ప్రజలపై యుద్ధం – రిపబ్లిక్‌ తన పిల్లలను తానే చంపుకుంటున్నది

రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, దాన్ని విలువలేని దానిగా మార్చివేస్తూ రాజ్యాంగాన్ని విశ్వసించని వాళ్ళని మాత్రం నేరస్తులుగా పరిగణించే స్థితికి ప్రజాస్వామిక వ్యవస్థ దిగజారిపోయింది. రాజ్యాంగం గురించి ప్రజల్లి మాట్లాడకుండా చేయడమే కాదు, మాట్లాడిన వాళ్ళందరిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తూ అవసరం అనుకుంటూ అర్బన్‌ నక్సల్‌గా ప్రకటించే సంస్కృతి కొనసాగుతుంది. ప్రజా పోరటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్ని కేవలం చట్టాల వరకే పరిమితం అయ్యాయి. ఆచరణ అంతా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థ నడవాలనే స్థితిలో నేరస్తులే దొరలుగా కీర్తించబడుతున్నారు. న్యాయం కోసం నిలబడ్డవారు నక్సలైట్‌గా ముద్రవేసుకోబడి కాల్చివేయబడుతున్నారు. ప్రజా