వ్యాసాలు

పాట పాడితే నోటీస్‌

‘యిళ్ల నుంచి వెళ్లగొట్టడంపై పాట పాడినందుకు యూపీ పోలీసు నోటీసు యివ్వడం సరైనదా కాదా అని ప్రజలు నిర్ణయించాలని కోరుకుంటున్నాను’ - నేహా సింగ్‌ రాథోడ్‌ ఉత్తర ప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వెనుక ఉన్న రాజకీయాలు బుల్డోజర్‌ సంస్కృతిగా దేశవ్యాప్త ప్రచారమైంది. అలాంటి ఒక ఘటనపై భోజ్‌పురి ప్రసిద్ధ జానపద గాయని నేహా సింగ్‌ రాథోడ్‌ (24సం)కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆమె రాజకీయ స్పృహతో జానపద పాటలు పాడే  గాయని.             ఫిబ్రవరి 15న కాన్పూర్‌ (రూరల్)లోని మదౌలీ గ్రామంలో ఆక్రమణల వ్యతిరేక చర్యలో 44 ఏళ్ల ప్రమీలా దీక్షిత్‌,  19 ఏళ్ల ఆమె కుమార్తె సజీవ
వ్యాసాలు

పోస్కో దారిలోనే జిందాల్ పోక త‌ప్ప‌దు

నేప‌థ్యంః దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం  ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న  వ్యవసాయ భూమిని  రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం ద‌శాబ్దంపైగా న‌డిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి.    ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణల‌తో అట్టుడుకుతున్న‌ది. ఎప్ప‌టిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది. ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది  ఉంటున్నారు. వారిలో  అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే
వ్యాసాలు

14 సంవత్సరాల తరువాత నిర్దోషులుగా తీర్పు

14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్  కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది  2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు