నా భావాలను, కలాన్ని
నీ ఫాసిస్టు కత్తితో
నరికినంత మాత్రాన
నేను అంతమై పోను
అంతకన్నా అదృశ్యమై పోను
దోపిడీ వ్యవస్థలో
బుసలు కొడుతున్న
నీ ఫాసిస్టు భావజాలాన్ని
కూకటి వేళ్ళతో సహా అడ్రస్ లేకుండా
పెకిలించడానికి నా సైన్యం
కలంధారీ, ఆయుధధారీ పదునెక్కుతోంది
చిందిస్తున్న నా నెత్తురుతో
తడిసిన నెల పొరల్లోంచి
పోరు విత్తనాలు మొలకెత్తి
నలుమూలల
విస్తరించి నీ అంతాన్ని చూస్తాయి.
శతృవు తూటాలకు దడిస్తే
ఒక్క తూటా శబ్దమే
నిన్ను అవహించి
నీ ప్రాణాన్ని వెంటాడుతుంది కామ్రేడ్
నీ లక్ష్యసిద్ధికై
పిడికిళ్ళు బిగించి
యుద్ధానికి సిద్ధమైతే
వేల తూటాలనైనా జడిపించే
నీ లక్ష్యం నిను నడిపిస్తుంది.
ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి
నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా మొఖాన్ని తడుముకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా కన్నీళ్లను తుడుచుకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు ఆకలంటూ నా పొట్టను పట్టుకున్నాను బాంబుల శబ్దానికి ఉలిక్కిపడి
ఒకరి గురించి దుఃఖపడడం గుండె కవాటాలను మెలితిప్పుతుంది కదా .... పెంచిన చేతులలోనే చివరి శ్వాస వదిలే పసిపాపల కనులను చూస్తూ ఆ గుండెలు మూగబోవా! .... నీకేమి కాదు మెదడులోకి ఇంకినది హృదయంలోకి