కరపత్రాలు

మనమంతా ఒకే గొంతుగా నినదిద్దాం

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌, చిత్తనూరులో ఏర్పరుస్తున్న ఇథనాల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలి పాదయాత్ర తేది : 11.02.2023 చిత్తనూరు నుండి  తేది : 21.02.2023 ఆత్మకూరు దాకా ప్రియమైన సోదరీ సోదరులారా ! మిత్రులారా ! జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌ వారు చిత్తనూరు శివారులో మూడు పంటలు పండే భూములలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అబద్దాలు చెబుతూ మోసపూరితంగా చిత్తనూరు, ఎక్లాస్పూర్‌, జిన్నారం గ్రామాలకు చాలాదగ్గరలో జనావాసాల నడుమ ఈ కంపెనీ పనులు శరవేగంతో నిర్వహిస్తున్నారు. వాళ్ళు తొలుత మనకు నేరేడు పండ్లతోట పెడతామని చెప్పారు. కొద్దిరోజులలోనే ఇథనాల్‌ కంపెనీ నిర్మిస్తున్నారనే
కరపత్రాలు

రాయలసీమకు ఏం చేస్తారో చెప్పండి, ఓట్ల కోసం వచ్చే  వైసీపీని, టీడీపీ కూటమిని నిలదీయండి

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమ సమస్యలు ఇప్పటికీ గుర్తుకు రాలేదు. ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైసీపీగాని, అంతక ముందు ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలి, మళ్లీ అధికారం కావాలనుకుంటున్న టీడీపీగాని ఫలానా రాయలసీమ ఫలానా సమస్యను పరిష్కరిస్తామని నిర్దిష్టంగా  మాట్లాడటం లేదు. రాయలసీమకు ఏ వాగ్దానమూ చేయకుండానే సీట్లు సంపాదించుకోవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ అనుకుంటున్నాయి. ఉచితాలు, పింఛన్లు తప్ప రాయలసీమకు అతి ముఖ్యమైన నీటిపారుదల రంగం గురించి మాట్లాడటం లేదు. కరువుబారినపడి వేలాది గ్రామాలు వలస పోతున్న సీమ పల్లెల
కరపత్రాలు

కార్పొరేటీకరణ – భారత రాజకీయార్థిక వ్యవస్థ సదస్సు

కామ్రేడ్‌ కనకాచారి స్మృతిలో దేశాన్ని అమ్మేస్తున్నవారే దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు. దేశభక్తిలో తమను మించిన వాళ్లు లేరని దబాయిస్తున్నారు. మిగతా అందరినీ దేశద్రోహులని చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం. మోదీ తనకు ప్రియమైన ఆదానీని ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో నిలబెట్టడం. దీని కోసం ఉన్న చట్టాలన్నిటినీ ఉల్లంఘించడం. ఇష్టం వచ్చినట్లు మార్చేయడం. నిరంకుశ చట్టాలు తీసుకరావడం. ఇదీ ఇవాళ దేశభక్తి విశ్వరూపం. దేశభక్తి రహదారిలో భారత ఆర్థిక వ్యవస్థ కార్పొరేటీకరణ అంతిమ లక్ష్యంతో శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రజల రక్త మాంసాలతో ఉత్పత్తి అయిన సంపదలను, అపారమైన సహజ వనరులను
కరపత్రాలు

విరసం 24వ సాహిత్య పాఠశాల కరపత్రంసంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్రకా. సాయిబాబా సందర్భం

ఈసారి సాహిత్య పాఠశాల ఇతివృత్తం ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారులు’. ఇటీవలే మనకు దూరమైన ప్రియతమ కామ్రేడ్‌, కవి , విప్లవ మేధావి ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా తన జీవితంతో, మరణంతో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపైకి సంధించిన చురుకైన ప్రశ్నలూ ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. సంకెళ్లలోనే స్వేచ్ఛాగానం చేయడం, చీకటిలో వెలుగును కలగనడం, అణచివేస్తే విముక్తిని ప్రకటించుకోవడం, అంతిమంగా మృత్యువులో కూడా చావును నిరాకరించడం అనేవి ఇంకెంత మాత్రం రొమాంటిక్‌ వ్యక్తీకరణలు కాదని ఆయన నిరూపించారు. ఆయనకంటే ముందు అత్యంత దుర్భర స్థితిలో, వైద్యం అందక జైలులో మరణించిన మావోయిస్టు రచయిత్రి నర్మద(ఉప్పుగంటి నిర్మల) కూడా
కరపత్రాలు

మానవ హననం ఆపాలి…. శాంతి చర్చలు జరపాలి

*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ఆదివాసులు, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి, ఒడిషా, ఆంధ్ర, తెలం గాణ, ఝార్ఖండ్, బెంగాల్, కేరళ  రాష్ట్రాలలోని ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలోనూ, విడిగా తమ తమ ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల న్నింటా ఉన్న అపారమైన ఖనిజాలను అదానీ, అంబానీ, వేదాంత, టాటా, బిర్లా తదితర కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పడం కోసం అక్కడి ఆదివాసీలను తమ స్వంత గడ్డపై నుండి బేదఖలు
కరపత్రాలు

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో.. విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌ మిత్రులారా! మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు
కరపత్రాలు

 ప్రజా పాలనా? నియంతృత్వ పాలనా?

పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి!   ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం
కరపత్రాలు

అమరులను స్మరించుకుందాం, కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం

జూలై 18 గురువారం మధ్యాన్నం 1.30  నుంచి సా. 6 గంటల దాకా బహిరంగ సభసుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య హాలు, హైదరాబాదుఅధ్యక్షత: అంజమ్మ(ఎబిఎంఎస్‌)వక్తలు: రివేరా(విరసం)నారాయణరావు(పౌరహక్కుల సంఘం)బట్టు వెంకటేశ్వర్లు(ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ వేదిక)ప్రొ. హరగోపాల్‌ప్రజాకళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు మనుషులందరూ సమానంగా ఉండాలని, కుల, మత, వర్గ, లింగ వివక్ష లేని సుందరమైన సమాజాన్ని నిర్మించాలని, తరతరాల దోపిడీ నుండి విముక్తికై పీడిత ప్రజానీకం ఏకమై నిరంతరం జరిపే వర్గ పోరాటమే మావోయిస్టు ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించి, మావోయిస్టు రహిత భారత్‌ ను నిర్మిస్తామని మోదీ, అమిత్‌ షా ప్రకటించారు. అందులో భాగంగానే మధ్య
కరపత్రాలు

కా. గంటి ప్రసాదంగారి 11వ వర్ధంతి సందర్భంగా..

కార్పొరేట్‌ హిందుత్వ కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం భారత విప్లవోద్యమానికి అండగా నిలబడదాం సంస్మరణ సభ జూలై 6 శనివారం ఉదయం 11 గంటల నుంచి, బొబ్బిలి కా. గంటి ప్రసాదంగారు అమరుడై పదకొండేళ్లు. ఆయన నక్సల్బరీ చైతన్యంతో ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం వివిధ రంగాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించారు. విప్లవ పార్టీల ఐక్యతా క్రమంలో   అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు. 2015లో అరెస్టయ్యాక జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అప్పటి నుంచి తిరిగి బహిరంగ ప్రజాపోరాటాల్లో భాగమయ్యారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడిగా విప్లవ భావజాల ప్రచారానికి కృషి చేశారు. వివిధ రంగాల్లో ప్రజాస్వామిక పోరాటాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. విప్లవోద్యమానికి
కరపత్రాలు

మధ్య భారతదేశంలో ఆదివాసుల హననానికి వ్యతిరేకంగా పోరాడుదాం

ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, చత్తీస్‌ఘడ్‌లో ఉన్న కోట్లాది విలువైన సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసీలపై అతిక్రూరంగా మారణకాండను దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. అలాగే వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో లక్షలాది బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధ స్థితిని కొన సాగిస్తుంది. ఇది గాజా, ఉక్రెయిన్‌ల కన్నా దారుణ స్థితిని దాటిపోయింది. మనపక్కన ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీల జీవితాలపై పై భారతసైన్యం తీవ్రంగా దాడి చేస్తున్న విధానాన్ని మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష