దండకారణ్య సమయం

బీజాపూర్ హత్యాకాండపై డిజిపికి లేఖ

13 నవంబర్ 2024 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్  విషయం: బీజాపూర్ జిల్లాలో చట్టవిరుద్ధమైన నిర్బంధాలు; చట్టాతీత హత్యలు – అన్ని నిర్బంచించిన వారిని వెంటనే  విడుదల చేయాలి; నిష్పాక్షిక విచారణను జరపాలి– సంబంధించి సర్, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ ప్రొఫెసర్లు, ఇతర న్యాయ నిపుణుల జాతీయ సమిష్టి సభ్యులుగా, నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్ (నజర్) గా పిలువబడే మేము, ఛత్తీస్‌గఢ్,  బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు ఇటీవల, నవంబర్ 8, 2024, చేసిన చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ప్రముఖ కార్యకర్తలతో సహా
సంపాదకీయం

ఇదొక హిందుత్వ దారి…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు  ప్రధానమైన విషయాలు చర్చనీయాంశంగా వున్నాయి.మొదటిది భావ ప్రకటనా  స్వేచ్ఛపై నియంత్రణ. రెండవది కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతన వాదిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం . ఈ రెండు విషయాలు పరిష్పర ఆధారితాలు. భావ ప్రకటన స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీ  తన ప్ర త్యర్థి జగన్ కాంగ్రెస్ నుండి లాక్కోవడం  మాత్రమే కాదు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల దగ్గర పంచాయితీ ,అరెస్టులు ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. వందలాదిమంది   యూట్యూబర్లను  పోలీస్ స్టేషన్ కు పిలిచి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు.    పదేళ్ల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో 
మీరీ పుస్తకం చదివారా ?

ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..

మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం                                                                                                                                                 -అద్దేపల్లి రామ్మోహన్‌ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే  ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం
Stories

Punishment

Sannu was walking, taking each step with a broad smile. He just started to learn how to walk. Maybe because he slept all day and woke up after drinking milk to his heart's content from his mother, his face looked even more peaceful and happy than ever. In the evening sunlight, his dusky body was glowing. He extended one hand forward as if trying to hold onto something, taking each
సంపాదకీయం

విప్లవ మానవుడు అమరుడు జి ఎన్ సాయిబాబా

విరసం ప్రపంచ విప్లవ మానవుడిగా పేర్కొన్న అమరుడు కామ్రేడ్ జి ఎన్ సాయిబాబా ఎక్కడ పుట్టి చేతులతో పాకుతూ, బుద్ధితో జ్ఞానాన్ని పొందుతూ చేతనతో వివేకాన్ని పెంచుకుంటూ నిజంగానే ప్రపంచమంతా తిరుగుతూ విప్లవ ప్రస్థానం చేసాడు. అమలాపురం పక్కన ఒక వ్యవసాయ కూలీగా మారిన పేద రైతు ఇంట్లో పుట్టి చదువు కోసం ఆ ఊరు చేరేనాటికి అది కోనసీమ. ఆయన జీవితం మాత్రం తండ్రి నాడు చిన్న రైతుగా కొంత భూకమతం కలిగి ఉన్నా బతుకు దుర్భరమై సాయిబాబా, పోలియో బాధితుడైన సాయిబాబా చదువుకుంటేనైనా భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు సాహసం చేసి అమలాపురానికి తరలివచ్చారు. అయితే సాయిబాబా
పత్రికా ప్రకటనలు

బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేయండి

అటవీ భూములను మైనింగ్‌ అవసరాల కోసం మళ్లించేందుకు వేదాంత కంపెనీ అధికారులు, జిల్లా యంత్రాంగం బూటకపు గ్రామసభలు నిర్వహించడంపై నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రయత్నాలపై మా మాటి మలి సురాఖ్య మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒడిశాలోని తిజిమాలి, కుట్రుమాలి, మజ్‌హింగ్‌మాలి కొండలపై ఉన్న బాక్సైట్ మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూంది.   తిజిమాలి కొండల చుట్టూ నివసించే ప్రజల సమ్మతి లేకుండా తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో సిజిమాలి అని వుంది)లో బాక్సైట్ తవ్వడానికి ఒడిశా ప్రభుత్వం వేదాంత లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2023 మార్చి 1 న, వేదాంతను ప్రాధాన్య వేలందారుడిగా ప్రకటించారు. 311 మిలియన్ టన్నుల
కవిత్వం

నా తండ్రీ

నాయిన భుజాలనెక్కిమెడ చుట్టూ కాళ్లు వేసుకుని దారిన ఎవరైనా పోతుంటే అచ్చెరువేకదూకొండలు, మిద్దెలు, పచ్చలు తొడిగిన చేలునే చూడలేనివన్నీ ఎంత బాగా అగుపిస్తాయో వాళ్లకు!నాకులేని అదృష్టానికి దిగులయ్యేది…నా తండ్రిని నేను చూడలేదుఒంటరి చింత చెట్టుకింద జీరంగుల ఆకలితీరుస్తూనోమసీదు గోడన చాకలి పూలు ఏరుతూనోదిగులు దిగదీసుకునేవాణ్ణిఅనుకోకుండా కొన్ని చేతులు నన్నెత్తుకున్నాయిపలకలు తెచ్చాయి పలుకులు దిద్దాయిమాటలకు మురిసి ముద్దయ్యాయికొన్ని భుజాలు నన్నెక్కించుకున్నాయిరంగురంగుల లోకం పట్టకంలోపారదర్శకం అయ్యింది.ఎత్తుకున్న ఈ తండ్రి… పైకి చూస్తే ధిక్కారమూకిందికి చూస్తే కారణ్యమూ వుండాలన్నాడుమట్టిని మరవొద్దన్నాడునెర్రెలిచ్చిన నేలా, పర్రెలిచ్చుకున్న బురద కాళ్లు చూపాడుభూమే కాదు లోపటి బంగారమూ మనదేనన్నాడువాటిని కాపాడేకే అడవుందిదానికి అండగా మన ముందామన్నాడుతన పక్కటెముకను విల్లుచేసియిచ్చాడు.అన్ని
నివేదిక

హస్‌దేవ్ ఉద్యమకారులపై పోలీసుల దాడి

 ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అడవుల్లో పర్సా బొగ్గు గని కోసం చెట్లను నరికివేయడానికి నిరసన తెలియచేసినందుకు స్థానిక ఆదివాసీ సమాజం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నిరసనకారులపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేశారు, ఇందులో హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితి కార్యకర్త రాంలాల్ కరియం, పలువురు ఆదివాసీలు తీవ్రంగా గాయపడ్డారు.  ఆగ్రహించిన ఆదివాసీ గ్రామస్తులు విల్లులు, బాణాలు, గులేరులతో చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో కొంతమంది పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. తొలుత ఘర్షణల అనంతరం భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య చెట్ల నరికివేతను ప్రారంభించారు.  హస్‌దేవ్ అడవుల్లోని పర్సా బొగ్గు గని కోసం అటవీ-
వ్యాసాలు

న్యాయవ్యవస్థను  ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా నియంత్రిస్తోంది ?

న్యాయవ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్‌  బలమైన పట్టు భారత రాజ్యాన్ని బలహీనపరచడం ద్వారా హిందూ-రాష్ట్రాన్ని సృష్టించే వారి అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో వారికి ఎలా సహాయపడుతుంది అనే అంశంపై  వివిధ పత్రికలు, సర్వేల నుండి వచ్చిన నివేదికలు వివరణాత్మక విశ్లేషణ చేసాయి. ఈ కథనం వివిధ వేదికలలో ప్రచురితమైన నివేదికలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. న్యాయ వ్యవస్థలోని అన్ని రంగాలపై ఎబివిపి, ఇతర హిందూత్వ సంస్థలు, ముఖ్యంగా అఖిల భారతీయ న్యాయవాది పరిషత్ (ఎబి‌ఎపి)ల ఆధిపత్యం గురించిన వాస్తవాలను వ్యాసం విశ్లేషిస్తుంది. న్యాయవ్యవస్థ అనేది రాజ్యానికి ఒక సైద్ధాంతిక సాధనం; ఇది ప్రజాస్వామ్య ఆకాంక్షలకు సంబంధించి దృఢంగా ఉండాలి. అయితే