దండకారణ్య సమయం

ఛత్తీస్‍ఘడ్‍లో ప్రధాన స్రవంతి మీడియా

ప్రభుత్వం తప్పు చేస్తోంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, ఎక్కడైనా ప్రమాదం జరిగింది, ఏదైనా ఘటన జరిగింది.. ఈ సమాచారాన్నంతటినీ  మీకు చేర్చేదాన్ని మీడియా అని అంటారు. ఈ మీడియానే  మీ మాటలను ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ “వార్త”ల వాళ్ళ “వార్త” ను ఇవాళ మీకు అందించాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా మీరు భావించే మీడియా, మన దేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దేశం మొత్తం మీద ఇప్పుడు మీడియా పరిస్థితి ఏమిటి, సోషల్ మీడియా మాధ్యమంలో మొత్తం మాధ్యమాలతో పరిస్థితి ఏమిటి అని ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీడియా కార్పొరేట్ గుప్పిట్లో
సమకాలీనం

వాళ్లిద్దరి విడుదల గురించీ నినదించలేమా?

చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న జరిగిన ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేట కు చెందిన దళిత యువకులు. కేవలం ఆర్ధిక అవసరాల కోసం ఇతరత్రా డబ్బులు దొరకని అప్పు పుట్టని పరిస్థితుల్లో వారు దోపిడీ చేయాలనుకున్నారు. అలాంటి ఆలోచనలకు ఆ ఇద్దరూ నెట్టివేయబడడానికి కారణం ఖచ్చితంగా సమాజమే. ఈ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతాంగానీ ... ఇదే అసలు సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. బస్సు దహనం జరిగిన సందర్భంగా 23
కవిత్వం

నెత్తుటి వెలుగు బాటలో

దుఃఖమొక్కటే దేహమంతా వ్యాపిస్తూ నిలువునా దహించి వేస్తూంది తెగిపడ్డ అవయవాల చుట్టూ ముసురుకున్న ఈగలులావాళ్ళు కేరింతలు కొడుతూ దేహము నుండి వేరుచేయబడ్డ మెదళ్ళు కోటి ఆలోచనలను వెదజళ్లుతూ చెట్టు మొదళ్లపై వేలాడుతూ మూయని కనురెప్పల వెనక దాగిన కలలు అడవి చుట్టూ పచ్చని కాంతి వలయాన్ని వెలిగిస్తూ ఒరిగిన వారి వాగ్దానాన్ని కాల్చి బూడిద చేయాలని చూస్తే ఎగసిన నిప్పు రవ్వలు నేలంతా వ్యాపిస్తున్నాయి ఊర్మిళ మరి పదునాలుగు మంది యుద్ధంలో మేమే ముందున్నామని నింగికి నేలకు మెరుపుల వంతెన కడుతున్నారు రా నువ్వూ నేనూ తోడుగా నడుద్దాం వారి భుజం పై బరువును మార్చుకుందాం!!
విశ్లేషణ

త్యాగాల తల్లుల పేగుబంధాలు.. వియ్యుక్క కథలు

వియ్యుక్క కథలు 6 సంపుటాలు నా చేతికందినప్పటి నుంచీ 6 పుస్తకాలు చదివి వివరంగా సమీక్ష గానీ, వ్యాసం గానీ రాయాలనుకుంటూనే ఉన్నాను.  పుస్తకం వచ్చిన వెంటనే వస్తే ఉన్నంత తాజాదనం ఉండదేమో అనే ఆలోచన వల్ల ఇప్పటికి ‘‘అమ్మతనం’’ కి సంబంధించిన 8 కథలను ప్రత్యేకంగా పరిశీలించే పనికి పూనుకున్నాను. ఇక విషయంలోకి వస్తే ‘‘అమ్మతనం’’ పూర్వకాలంలో లేదా సాంప్రదాయంలో మాతృత్వం అనే మాటకు సరిపోల్చదగిన మాట. కానీ మనం అమ్మతనం అని అనుకోవడంలోనే సహజత్వం వ్యావహారికం ఉన్నాయని నా భావన. ఇప్పుడు కథల గురించి తెలుసుకుందాం. ‘‘పిల్లలు’’ అనే కథ తాయమ్మ కరుణ రాసింది. సుమ,
కవిత్వం

నల్లని కత్తి

ఎందుకో?కార్పోరేట్లకుబహుళ జాతులకుశూలల సూపులకునల్ల కలువలే నచ్చుతయివాళ్ళు ఏం మేలు చేయాలనుకొన్నా ?తోలునే తొలకరిని చేస్తరునల్లని ముఖం మీదతెల్లని మల్లెలు ఆరబోసినట్టునింగి మంగుళం మీదమక్క పాలాలు ఏంచినట్టువాళ్ళ నవ్వుల పువ్వుల కోసమేపూనికతోని దీక్ష పట్టినట్టుఇది ప్రపంచ పెద్దలుపేదరికం మీద విసిరినపరిహాసపుటస్త్రం అనిపరిపరి విధాల పరితపించినాకాలే కడుపు సాలు దున్నదనీమాడే ఎండ నీడ కోరుతదనీమర్మం తెలిసిన వారికిమనసున పట్టింది.నూకలు పెడతా మేకలు కాస్తావా?అన్నడొకడువివక్షల విలువల ధర్మానికివిలుకాన్నై కావలుంటానన్నడింకొకడు.నోరును అదుపులో వెట్టుకొనిపోరును పొరక పొరక చేసివిలాసాల వినువీధుల్లోకులాసాల కుటిల నీతుల్లోకుర్చీలు ఎక్కినంకకుత్తుకలను కోసేకత్తులైతరుకోరుకున్న కుదురుకుంగుతుందంటేనోటికి పడ్డ తాళాలు ఊడితైతక్కలాడుతయిఏరి ఏరి కొన్ని అన్యాయాల మీదనేకోరి కోరి ఆయుధాలు ఎక్కుపెడుతరుఅవసరం తీరినంక ఆయుధాలు ఆత్మను
పాట

జన సమర భేరి

పల్లవి:ఓ.. సాయి బాబా - జన సమర భేరినిత్య సంఘర్షణే-నీ త్యాగ నిరతినీ తలను చూసిఏ శిలకు వణుకునీ గళం కలముకులేదాయె బెణుకుఆ కొండ కోనలేనీ గుండె బలముఆదివాసే కదావిముక్తి దళముబండి చక్రం పైనె ఎడతెగని పయనంబందించినా జైలు కౄర పరిహాసం ||ఓ సాయి బాబా||అమలాపురమొక ఉద్యానవనముఏ తల్లి నినుగందొ ప్రజలకే వరమూకళాశాల కదన రంగమయ్యిందోకవిగా నీ కలల పంట పండిందోఅక్షరాల పరుగు ఆగనిది వెలుగుదీక్షగా ఢిల్లీకి చేరింది అడుగుముంబై ప్రతిఘటననీ కాయకష్టంవిశ్వజన పీడితులశంఖారావంసామ్రాజ్యవాదాన్ని ఎదిరించె లక్ష్యంపోరాట ప్రపంచమొకటయ్యె గమ్యం ||ఓ సాయి బాబా||మండేటి కాశ్మీరు మనసుల్ని గెలువారగిలేటి ఈశాన్య రాష్ట్రాల తెగువాకార్పోరేట్ల దృష్టి కారడవి పైనేకడుపులో దాగిన