మట్టి మనసుల చిత్రణ కుందేరు సాక్షిగా
సురేంద్ర శీలం రాసిన ఈ నవల కేవలం కుందేరు నది ఒడ్డున ఉన్న క్రిస్టిపాడు గ్రామ కథ మాత్రమే కాదు. ఆ ఊరి ప్రజల జీవితాలను మాత్రమే చిత్రించదు. ఇది మట్టి మనుషుల మనసుల లోతులను పరిశీలిస్తూ, వారి జీవన విధానాన్ని, భావోద్వేగాలను సూక్ష్మంగా అద్దం పట్టే నవల. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని అక్కడి మనుషుల బంధాలను, అక్కడి రాజకీయాలను, అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సహజంగా నది అనేది నాగరికతకు మూలం. నాగరికత వృద్ధి చెందే క్రమంలో అక్కడ జరిగిన మార్పులకు అక్కడి ప్రజల జీవితాల్లో సంస్కృతి పరంగా, జీవన విధానంలో అన్ని రకాల మార్పులకు సాక్ష్యం నది.





