ఆర్థికం

ఇండో–అమెరికా ఒప్పందం: సామ్రాజ్యవాదపు పునర్వ్యవస్థీకరణలో భారత పాలక వర్గాల పాత్ర

2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన 50శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించిందని, ఇది మోదీ వల్లనే సాధ్యమయిందని ప్రకటించి మోదీకి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన ఎట్లా అమెరికా ఒత్తిడికి దాసోహం అయ్యాడనే వాస్తవాన్ని మరుగుపరచాలని మోదీ ప్రచార టీం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా పెట్టుబడులకు దాసోహం చేసే ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందంలో ఏముంది? భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని
సమకాలీనం

చాకలి కులస్థుల పై దాడి- ఆధిప‌త్య భావ‌జాలం

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా తేదీ 18 న టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే సాకుతో చాకలి కులస్థులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికల పై అదే గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి నాయకత్వంలో సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి మొదలగు వారు అగ్రకుల దురహంకారంతో భయంకరంగా దాడి చేసి కొట్టారు. రెండు నెలల పసిపాపను కాళ్ళతో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డ పాప 21 వ తేదీన చనిపోయింది. రెడ్లు చేసిన ఈ క్రూరమైన దాడిని మానవత్వం కలవారందరూ ఖండించాలి. హంతకుల పై మర్డర్ కేసు నమోదు
వ్యాసాలు

కొత్త లేబర్ కోడ్స్ ను రద్దు చేసేదాకా పోరాడాల్సిందే

భారత ప్రభుత్వం నవంబర్ 21, 2025 నుండి 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 కొత్త కార్మిక కోడ్‌లను (Labour Codes) అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక కోడ్‌లు (చట్టాలు)(New Labour Codes) ప్రజల్లో కార్మిక లోకంలో పెద్ద చర్చకు దారితీశాయి. కార్మికులు వీటిని "బానిసత్వ చట్టాలు"గా అభివర్ణిస్తుంటే, ప్రభుత్వం ఇవి "వ్యాపార సులభతరం (Ease of Doing Business)" కోసం చేసిన సంస్కరణలని అంటోంది.అయితే ఈ కార్మిక చట్టాలను మనం గమనిస్తే ఇవి కార్మికుల హక్కులను కాలరాస్తూ , యాజమాన్యాలకు పూర్తి అధికారాలను కట్టబెడుతూ కార్మికులను " కట్టు బానిసలుగా" మార్చడానికి
వ్యాసాలు

ఎప్‌స్టీన్ ఫైల్స్ .. వ్యవస్థల పతన గాథ

ఎప్‌స్టీన్‌ ఫైల్స్… సంచలనం కాదు.. వ్యవస్థల శవపరీక్ష!" జెఫ్రీ ఎప్‌స్టీన్‌... ఇది కేవలం ఒక నేరగాడి పేరు కాదు, చట్టాన్ని చుట్టచుట్టి జేబులో పెట్టుకున్న ఒక వికృత వ్యవస్థకు చిహ్నం. ఫిబ్రవరి 2026 నాటికి వెలుగులోకి వచ్చిన 6 మిలియన్ల పేజీల పత్రాలు, మనం గొప్పగా చెప్పుకునే 'నాగరిక లోకం' ముసుగును చీల్చి పారేస్తున్నాయి. ఇవి కేవలం అరాచకాల జాబితా కాదు. అధికారం ఉంటే అమానుషత్వాన్ని కూడా అలంకారంగా మార్చుకోవచ్చని నమ్మే 'ఎలైట్' వర్గాల అంతర్గత డైరీ. ధనం ముందు న్యాయదేవత కళ్లు గంతలు కట్టుకున్న వైనానికి, పెట్టుబడిదారీ సమాజం సృష్టించిన ఈ 'మృగ సామ్రాజ్యం' ఒక నిలువెత్తు
సమీక్షలు

విముక్తి పోరాట కథలు

ఇటీవ‌ల *కొలిమి* ప్ర‌చుర‌ణ‌గా విడుద‌లైన *అల్లం రాజ‌య్య క‌థ‌లు-నేప‌థ్యం* పుస్త‌కానికి రాసిన ముందుమాట‌)  కొన్ని కథలు మనల్ని నిద్రపోనీయవు. వెంటాడతై. నిద్రలోనూ. మెలకువలోనూ. లోలోపల కల్లోలం రేపుతై. మనసంతా దిగులు నింపుతై. కన్నీళ్లు నింపుతై. జీవితాంతం గుర్తొస్తయి. అట్లాంటి కథకులు కొందరే ఉంట‌రు. తమ చుట్టూ ఉన్న జీవితాలను నిశితంగా పరిశీలించి రాస్తరు. లోలోపల దగ్దమవుతూ వెన్నెల కురిపించే వాక్యాలు రాస్తరు. తెలంగాణ నేలన ఉవ్వెత్తున ఎగసిన ప్రజాపోరాటాలను కథలుగా రాసిన అల్లం రాజయ్యదీ అదే దారి. ఆ దారి ప్రజా గర్జనై ఉరిమిన ఉత్తర తెలంగాణ భూపోరాటాల దారి. నాగేటి సాళ్లల్ల రగిలిన రైతుకూలీల జైత్రయాత్ర దారి.
సమీక్షలు

మట్టి పరిమళం వెదజల్లే కథలు

(ఇటీవ‌ల విడుద‌లైన తాయ‌మ్మ క‌రుణ   క‌థ‌ల సంపుటి *విభ‌జ‌న రేఖ‌*కు రాసిన ముందుమాట‌) రచయితగా కరుణ పాఠకులకి కొత్త కాదు. దాదాపు మూడు దశాబ్దాల కాలంగా కథలు రాస్తోంది. ‘తాయమ్మ కథ’తో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన కరుణ, మొట్టమొదటి కథతోనే చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కథ పేరే ఇంటి పేరుగా మారిపోయి తాయమ్మ కరుణ అయ్యింది. ఇప్పటికే రెండు కథా సంకలనాలు ప్రచురించి ఉంది. విప్లవోద్యమం నేపథ్యంలో కథలు రాసిన తొలి తరం అజ్ఞాత విప్లవ మహిళా రచయితల్లో కరుణ కూడా ఒకరు. నక్సల్బరి ఉద్యమం భారత ప్రజల ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది
వ్యాసాలు

నాలుగేళ్ల నరమేధం.. ఆగేదెప్పుడు?

2014లో యుక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించున్నాక కూడ రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడి చేసింది. దాంతో యుక్రెయిన్ త‌న శ‌క్తినంతా కూడ‌దీసుకొని ప్ర‌తిఘ‌టించ‌టం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా  ఆధిప‌త్యానికీ యుక్రెయిన్ ఎదురొడ్డి నిలిచి చేస్తున్న‌ యుద్ధం  తీవ్రతను సూచిస్తుంది. ప్ర‌ధానంగా 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇటీవ‌లి చరిత్రలో సుదీర్ఘ యుద్ధంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను ఓడించడానికి సోవియట్ యూనియన్‌కు 14 వందల 18 రోజులు పట్టగా, గత నెలలోనే ఆ సమయాన్ని రష్యా-యుక్రెయిన్ యుద్ధం దాటేసింది. అప్పటి
సమకాలీనం

కృత్రిమ మేధ –  పాలకవర్గం

 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో కృత్రిమ మేధ ప్రభావం పై అంతర్జాతీయ శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సభలో 20 దేశాలకు చెందిన అగ్ర నేతలు, 60 దేశాలకు చెందిన మంత్రులు,  వందమంది కంపెనీ సీఈఓ లు పాల్గొన్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, "ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అభివృద్ది,  నైపుణ్యాల పెంపుదల, ఉద్యోగ కల్పన, నైతికత, విధాన రూపకల్పనలు చేయడంగా ప్రకటించబడింది". కృత్రిమ మేధ అన్నది ఇప్పుడే పుట్టినది కాదు. 1950 లలోనే "డాక్ మౌత్" కంప్యూటర్ల తయారీ, వినియోగము, స్టోరేజీ, భాషల అనువాదం,హేతుబద్ద సమాధానాల రూపకల్పనలలో ఇంటర్నెట్ వాడకం నుంచే ఇది
అనువాదాలు

షాహిద్ అజ్మీ- కటకటాల వెనుక నుంచి 

పోలీసు కస్టడీలో అది ఏడవ రోజు. మొదట్లో కొట్టిన దెబ్బలు ఇప్పుడు రోజుకు దాదాపు 22 గంటల పాటు సాగే విచారణగా మారాయి. నాలోని సహనమూ, రక్షణ కవచాలు సడలిపోతున్నట్లు అనిపించింది. పి.ఐ. ఖాన్విల్కర్ (ఇటీవలే అవినీతి కేసులో అరెస్టయ్యారు), యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కి చెందిన అలాంటి ఇతర అవినీతి అధికారులు ఆ విచారణ గదిలోనే తాము ఎంతమంది ముస్లింల రక్తాన్ని చిందించారో గొప్పగా చెప్పుకుంటున్నారు. దేశభక్తి పేరుతో వారు సాగిస్తున్న ఆ క్రూరమైన పోటీని చూసి నాకు అసహ్యమూ, వికారమూ కలుగుతున్న సమయంలోనే, కోర్టు అనుమతితో నాకు 'వకీల్ ములాకాత్' (న్యాయవాదితో భేటీ) కోసం పిలుపు వచ్చింది.
సమకాలీనం

గ్రామీణ ఉపాధి హక్కుపై ఉక్కుపాదం

1980ల నుండి ‘పనికి ఆహారం’ తదితర పేర్లతో కొనసాగిన పథకానికి 2006 సంవత్సరంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్(యుపిఎ) ప్రభుత్వం... గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసింది. ప్రజానుకూల ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల ప్రొద్భలంతో గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో రూపుదిద్దుకుంది. 2009 సంవత్సరంలో ‘మహాత్మా గాంధీ’ పేరును పథకానికి ముందు జోడించింది. ఎం.జి నరేగా (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రకటిత లక్ష్యపు దరిదాపులకు కూడా చేరుకోకపోయినప్పటికీ, ఎన్నో అవకతవకలు, లోటుపాట్లతో అవినీతిలో కూరుకుపోయినప్పటికీ... దేశంలోని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజానీకానికి ఏదో మేరకు ఉపశమనంగా పనిచేస్తోంది. ఈ పథకాన్ని సైతం