వ్యాసాలు

స్టోలోపిన్ నిర్బంధ కాలంలో విప్లవోద్యమం-మేధావులు

(ర‌ష్యా విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో 1905 తిరుగుబాటు ఓట‌మి ఘోర‌మైన అనుభ‌వం. ఉద్య‌మం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఆ స‌మ‌యంలో   ప్రతికూల మేధావులు, పార్టీ మేధావుల్లో కొంద‌రు మార్క్సిజంలోని మౌలిక భావ‌న‌ల‌కు, విప్ల‌వాచ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా త‌యార‌య్యారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని తిరగదోడే  ప్రయత్నం చేశారు.  విప్ల‌వ పంథా త‌ప్ప‌ని ప్ర‌చారం చేశారు.  మెన్షివిక్ నాయ‌కుడైన ప్ల‌హ‌నోవ్ *వారు ఆయుధాలు ప‌ట్టుకోవ‌ల‌సింది కాదు* అన్నాడు. దానికి లెనిన్ స‌మాధానం ఇస్తూ *మ‌నం సాయుధ పోరాటాన్ని మ‌రింత దృఢంగా, శ‌క్తివంతంగా నిర్వ‌హించి ఉండ‌వ‌ల‌సింది* అన్నాడు. ఆ కాలంలో తాత్విక రంగంలో త‌లెత్తిన మార్క్సిస్టు వ్య‌తిరేక వాద‌న‌ల‌ను తిప్పి కొడుతూ లెనిన్   “భౌతికవాదం- అనుభవవాద విమర్శ” అనే
స్పందన

సాయుధపోరాట ఎర్రజెండాను ఎత్తిపట్టిన విరసం మహాసభలు

విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. "భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం" అనే ప్రధాన నినాదంతో జరిగిన సభలు ప్రజల్లో నూతన ఉత్సహాన్ని రేకెత్తించాయి. భారతదేశ ప్రజా రాజకీయాల్లో వర్గపోరాట చైతన్యాన్ని రగిలించిన నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితో 1970లో విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భవించింది. అప్పటి నుండి నేటి వరకు  55 ఏళ్లుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,నక్సలిబరీ,శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర , దండకారణ్య పోరాటాల కొనసాగింపుని, అమరవీరుల త్యాగాల చరిత్రను ప్రజలకు రచనలు, కథలు, పాటల ద్వారా ప్రజలకు అందిస్తూ
పత్రికా ప్రకటనలు

త్వరలో.. ఈ తరం సాహిత్య విమర్శ ప్రారంభం

తెలుగు సాహిత్యంలోకి  అనేక జీవ‌న మూలాల నుంచి కొత్త త‌రం ర‌చ‌యిత‌లు వ‌స్తున్నారు. కొత్త అనుభ‌వాలను ప‌రిచ‌యం చేస్తున్నారు.  అద్భుత నిర్మాణ ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. చాలా ప్ర‌శంస‌నీయ‌మైన ఈ కృషిలో   ఈ కాలపు జీవ‌న సంఘ‌ర్ష‌ణ ఎంత ఉన్న‌ది?  యువ ర‌చ‌యిత‌లు దాన్ని ఎంత మేర‌కు ఒడిసిపట్టుకోగ‌ల‌గుతున్నారు?  జీవితంలోని మార్పు క్ర‌మాల‌ను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించ‌గ‌లుగుతున్నారు?  అనే ప్ర‌శ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి  అన్ని త‌రాలు ఎదుర్కొన్న‌వే. సాహిత్య విమ‌ర్శ ఈ స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌నీయాంశం చేయాలి. ప‌రిష్కారం చూపాలి.  తెలుగు  సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాప‌రంగా త‌క్కువే కావ‌చ్చుగాని,   కొత్త తరం ప్రవేశించింది.  ర‌చ‌యిత‌లైనా, విమ‌ర్శ‌కులైనా,
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం
ఖండన

పుస్తకాలను నిషేధించి చరిత్రను రద్దు చేయలేరు సాహిత్యంపై కశ్మీర్‌ ప్రభుత్వ నిరంకుశ దాడిని ఖండించండి

కశ్మీర్‌ ప్రభుత్వం 25 పుస్తకాలను నిషేధిస్తూ ఆగస్టు 5 నాడు జారీ చేసిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట. మన దేశంలో పుస్తకాలను నిషేధించడం కొత్త కాదు. ఈ విషయంలో బ్రిటీష్‌ పాలకుల వారసత్వాన్ని మన ప్రభుత్వం నిస్సిగ్గుగా స్వీకరించింది. అయితే ఒకేసారి 25 పుస్తకాల జాబితా ఇచ్చి, వీటిని నిషేధిస్తున్నామని, ఆ కాపీలు ఎక్కడున్నా జప్తు చేస్తామని ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ చూడని విపరీత పోకడ. ఈ జాబితాలో కశ్మీర్‌ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక పరిశోధనలు ఉన్నాయి. ఏండ్ల తరబడి అధ్యయనం చేసి, ఎన్నో డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసిన రచనలున్నాయి. ఎ జి