అనువాదాలు

ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న థర్మల్ విద్యుత్త్ కేంద్రం

జగదీష్ హంస్దాకు తను పెరిగిన గ్రామం గురించి అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. "అప్పట్లో అక్కడ మేము ఆదివాసీలం, మా పొలాలు, అడవులు, వన్యప్రాణులు తప్ప ఇంకేమీ ఉండేవి కావు," అని ఇప్పుడు డెబ్బై ఏళ్ల చివరలో ఉన్న హంస్దా చెప్పారు. అప్పటి బీహార్‌లో ఉన్న ఆ ఝింజిర్‌గుట్టు గ్రామం, ఇప్పుడు జార్ఖండ్‌ పరిధిలోకి వస్తుంది. "మాతో పాటు కొంతమంది మూలవాసీ సముదాయాల వారు కూడా నివసించేవారు," అని హంస్దా జోడించారు, ఆ ప్రాంతానికి చెందిన తక్కువ కులాలకు చెందిన సముదాయాలను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు. 1950ల చివరలో బీహార్ ప్రభుత్వం చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్‌ను
వ్యాసాలు

నాలుగు లేబర్ కోడ్ ల విప‌త్తు రాబోతోంది..

కేంద్రంలోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోనికి రావడం జరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశంలోని కార్మిక సంఘాలు 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు జాతీయ సమ్మెను నిర్వహించడం జరిగింది. దేశంలో గల కార్మిక వర్గం నుంచి విశేష స్పందన వచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకకు తగ్గలేదు సరి కదా మరింత పట్టుదలతో నాలుగు లేబరు కోడ్లను అమలు చేయడానికి ముందుకు వెళుతుంది. వీటికి ముందు చేసిన కొత్త న్యాయ చట్టాలు విషయంలో కూడా ఇదే జరిగింది. దేశంలో
సంపాదకీయం

సామ్రాజ్యవాద యుద్ధం మహిళల్ని విముక్తి చేస్తుందా?

ఇరాన్‌లో మత ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022లో మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మహ్సా అమిని అనే కుర్దిష్ మహిళ మరణం ఈ ఉద్యమాన్ని రగిలించింది. హిజాబ్ సరిగా ధరించలేదనే నేరానికి ఆమెను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కస్టడీలో ఆమె మరణించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇరాన్ ఆమ్మాయిలు బహిరంగంగా హిజాబ్‌లను మంటల్లో కాల్చేయడం, పొడవాటి జుట్టును కత్తిరించి పడెయ్యడం ప్రపంచమంతా చూసింది. నిరసన ప్రదర్శనల్లో వందలాది యువతీ యువకులు పోలీసు హింసకు బలయ్యారు. వేలాది మంది జైళ్లపాలయ్యారు. ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతప్తితో
సమకాలీనం

స్వేచ్ఛ, సమానత్వం కోసం మడవి సీమ పోరాటం

“పనిచేసే వాళ్లదే భూమి” –  బస్తర్ అమ్మాయి చూసిన అసమానతల నుంచి పుట్టిన ప్రజాస్వామిక నినాదం. 2025 ఏప్రిల్, మే నెలల్లో బస్తర్‌లోని కర్రెగుట్ట ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర పారామిలిటరీ బలగాలు “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” పేరుతో భారీ దాడులు నిర్వహించాయి . ప్రభుత్వం ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.  ఈ ఆపరేషన్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని అరెస్టు చేశారు. ఎన్నో గ్రామాలు ధ్వంసం అయ్యాయి. అరెస్టయిన వారిలో మడవి సీమ కూడా ఉంది. ఆమె వయస్సు పందొమ్మిదేళ్ళు. ఆమె ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉంది. పోలీసులు ఆమెను మావోయిస్టుగా అనుమానించి
వ్యాసాలు

గతాన్ని సమీక్షించుకుని సాయుధ పోరాట పథంలో  పురోగమిద్దాం!

(న‌క్సల్బ‌రీ శ్రీ‌కాకుళ పోరాటాల వెనుకంజ త‌ర్వాత విప్ల‌వోద్య‌మ పున‌ర్నిర్మాణానికి పూనుకున్న  కా. కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య 1972లో రాసిన సుప్ర‌సిద్ధ ప‌త్రం ఇది. దీనికి ఆత్మ విమ‌ర్శ రిపోర్టు అనే పేరు కూడా ఉంది. ప్ర‌స్తుత విప్ల‌వోద్య‌మ సంక్షోభాన్ని, తాత్కాలిక ఓట‌మిని విమ‌ర్శ‌నాత్మ‌కంగా  అర్థం చేసుకోడానికి, భ‌విష్య‌త్తుప‌ట్ల నిర్మాణాత్మ‌క‌, ఆశావాదంతో వ్య‌వ‌హ‌రించ‌డానికి స్పూర్తిని ఇస్తుంద‌ని ఈ ప‌త్రంలోని ఉపోద్ఘాత భాగాన్ని పాఠ‌కుల కోసం ఇక్క‌డ ఇస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీం) నక్సల్బరీలో 1967లో ఆరంభమైన రైతాంగ సాయుధ విప్లవం భారత విప్లవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. రివిజనిస్టు నాయకత్వం తెలంగాణా రైతాంగ సాయుధ విప్లవానికి ద్రోహం తలపెట్టిన తర్వాత చైతన్యపూరితంగా
వర్తమానం

యుద్ధం – గతితర్కం

ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాలు వాటి ఉన్నత రూపమైన యుద్ధాలు లేదా సాయుధ పోరాటాలు,తిరుగుబాట్ల చరిత్రే. నేడు అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని సామ్రాజ్యవాదులే ప్రత్యక్షంగా చేస్తున్న యుద్ధాలు కాగా మరికొన్ని వీరి ప్రోత్సాహంతో జరుగుతున్నవి. సామ్రాజ్యవాదమంటేనే యుద్ధమన్న సూత్రీకరణ నిరంతరం రుజువవుతునే ఉంది. సర్వ వ్యాప్తమైన ఈ యుద్ధం మునుపెన్నడూ కంటే నేడు మన సమాజాన్ని పీడిస్తుండడం వల్ల ఈ యుద్ధం అంటే ఏమిటి? ఇది ఎందుకు? ఎప్పటి నుండి ఉనికిలో ఉంది? ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఉనికిలోకొచ్చింది? దీన్ని ప్రజలకు ఉపయోగపడేలా మార్చుకోవచ్చా? యుద్ధాలకు ముగింపు పలకడానికి మార్గం మేమిటి?
వ్యాసాలు

ఆ ముగ్గురి  స్ఫూర్తి.. దేశ సార్వభౌమాధికార పోరాటం

మార్చి 23 భారతదేశ చరిత్రలో మరువలేని రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ నేలకొరిగి 95 ఏళ్ళు నిండాయి.ఈ సందర్భంగా వారిని స్మరించుకోడంతో పాటు వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశాన్ని‌  కుల,మత,జాతి వివక్షలకు తావులేకుండా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లే సార్వసత్తాక దేశంగా నిర్మించుకోవాల్సిన బాధ్య‌త‌ ఈ దేశ యువతీ యువకులపై, విద్యార్థులపై ఉంది. క్రీ.శ 1608 లో బ్రిటన్ కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో
కవిత్వం

భూసారం

సురగాలి అలజడికి ఆకులు రాలిపోవచ్చు పువ్వులూ నేలను ముద్దాడొచ్చు తుఫాన్ దాటికి కాండం విరిగిపడొచ్చు రక్షకముళ్ళన్నీ కొట్టుకుపోవచ్చు గుండె నిండా విశ్వమంత విశ్వాసం భూగర్భంలోని వేర్ల మీద భూతల్లి సారం మీద నీటి ఎద్దటిలోనే కాగితం పూలు వికసించును దీనస్థితి ఆత్మగౌరవములా ఆకురాల్చు కాలంలోనే మోదుగు పువ్వులొస్తాయి ప్రసవవేదనలో ఆఖరి కన్నీటిచుక్కలా నేలపగుళ్ళ గాయానికి చిరుజల్లుల చికిత్సల కాలమొస్తుంది ఆరుద్రల ఎరుపుర్యాలీ పిలుపుతో విత్తనపు సాలు సాగుతుంది కొత్తగా “ప్రకృతి, పంట” రెండు తారకలు శ్రమజీవుల కంటిరెప్పల దిగువన! గస్తీ కాస్తారు ఎర్రపొద్దు పొడిచే వరకు.!
కవిత్వం

గుండె కొలిమి

గీయ్యాల గాయమ్మ శోకం కడుపుకోతకు తెలుస్తుంది కన్నీళ్లతో భూతల్లి పాదాలు తడుపుతూ మానవత్వం సిగ్గు పడిందంటూ గుండెలు బాదుకుందికులం పేరుతో ఒకడు మతం పేరుతో ఒకడు అధికార ఆకలితో ఇంకొకడుఅందర్నీ ఆగం చేస్తుండ్రే గానీ..ఆసరగా ఒక్కరు లేకపాయేగా తల్లి బొడ్డు పేగు ఘోసగాలకెందుకు దెలవకపాయే...కులం పేరుతో కళ్లద్దాలు పెట్టుకున్న మీకు తాగే నీరు పీల్చే గాలి నిలబడే నేల ఎపుడైనానువ్వు ఏ జాతివాడివని నిన్ను అడిగినాయా ? నీ వర్ణం ఏదని నిన్ను ప్రశ్నిస్తాయా..!అన్యం పుణ్యం తెలవనిగా బిడ్డా...నీ కులానికి అడ్డయిందా నీ వర్ణానికి వాదంగా మారిందాఅది బిడ్డారా... బిడ్డా..అమ్మ తొమ్మిది మాసాలు మోస్తేపుట్టింది కానీకులం పురిటి నొప్పులను
తొలికెరటాలు

ముస్లిం బతుకుల హృదయ దీపం

"హృదయ దీపం" కథల సంపుటిని భాను ముస్తాక్ రచించారు. ఈ పుస్తకం 2025 సంవత్సరాలనికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నది. ఈ పుస్తకాన్ని తెలుగులోకి "నాగిని అప్పసాని" అనువదించారు. ఇందులో మొత్తం 12 కథలు ఉంటాయి. అవి ముస్లిం మహిళల రోజు వారి జీవితాలను, అనుభవాలను తెలియజేస్తాయి. వారి జీవితాల పట్ల సానుభూతి ఇందులో ఉంటుంది. ముస్లిం స్త్రీల దైనందిన జీవితంలోని బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయో ఈ పుస్తకం చదివితే కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వారికి రోజూ గృహింసనే కాదు, సామాజిక కట్టుబాట్లను  వారు నిశ్శబ్దంగా ఎలా భరించారనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా మూఢనమ్మకాలు