కమిలిన కన్నీటి చారిక మంగలిపల్లె
సంగరేణి అనగానే లోకానికి వెలుగునిచ్చే నల్లబంగారం గర్తొస్తుంది. నరేష్ కుమార్ సూఫీ దీనిని బంగారు భూమి అన్నాడు. ఆ బంగారు భూమితో తన అనుబంధం, ఆడిపాడిన బాల్యం, ఊహ తెలిసే వయసులో ఉక్కిరి బిక్కిరి చేసిన జీవిత కాఠిన్యం, తీపిని, చేదును పంచిన మనుషులు, నిలువెత్తు త్యాగమై ధగధగ మండిన వాళ్లు, బతుకుపోరాటంలో నిట్టనిలువునా కూలిపోయిన వాళ్లు, బొగ్గుట్టల కింద మాయమైన ఊరితో పాటు కనుమరుగైన వాళ్లు -అన్నిటిని సజీవ జ్ఞాపకాలుగా పరిచయం చేశాడు సూఫీ. నరేష్ కుమార్ సూఫీ కి తాను పుట్టి పెరిగిన ఊరు ఇదని మిత్రులతో చెప్పుకోడానికి ఇప్పుడక్కడ ఊరు లేదు. ఒక మానవ










