సమీక్షలు

వేమన, వీరబ్రహ్మం దృక్పథం

వేమన, వీరబ్రహ్మాల్ని తెలుగు పాఠక లోకం ముందు మరోసారి చర్చకు పెట్టినందుకు ముందుగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వారిని అభినందించాలి. వీరిద్దరూ సామాజిక సంస్కర్తలు, తరువాతే కవులు.  ఈ పుస్తకం పేరు ‘‘తెలుగు సాహిత్యంలో వేమన వీరబ్రహ్మం - ఒక సంభాషణ’’. రచయిత జి.కల్యాణరావు.  మూడు వందల సంవత్సరాల క్రితం కవులు వేమన, వీరబ్రహ్మ  సంఘ సంస్కర్తలు. సాంస్కృతిక విప్లవం మార్పును కోరుతుంది. సంస్మరణ మార్పును కాక మరమ్మత్తులు కోరుతుంది. సంస్కరణ మార్పుకు వ్యతిరేకం కాదు. ముందుస్తు రూపం. పైగా ఈ కవులు కలం పట్టేనాటికి మార్పుకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతం ఇంకా రూపొందలేదు కదా! ఈ నేపథ్యంలో