కవిత్వం

పెను చీకటి – ప్రచండ కాంతి

తొలిచూరుతల్లి పొత్తిళ్ళలోబిడ్డలా ఉంది వెన్నెల బిడ్డ కోసం తల్లి వేసేఊయలలా ఉంది పాలపుంత బడి విడిచాకకేరింతలు కొడుతూబయటికొచ్చే పిల్లల్లా ఉన్నాయిచుక్కలు బుజ్జాయినిబజ్జోబెట్టటానికితల్లి పాడే జోల పాటలాఉంది మంద్ర గాలి హాయి అంతా ఇక్కడే ఉంది అన్నట్టుఅమ్మ ఒడిలో నిదురబోయినచంటి బిడ్డ మోములా ఉందినింగి పురిటి నొప్పుల బాధనుదిగమింగుతూగట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టినగర్భిణిలా ఉంది రేయి ప్రచండ కాంతి తో పుట్టేసూర్యుడు ని ప్రపంచానికి హామిపడుతున్నట్టుందిపెను చీకటి...
సమకాలీనం

దేశద్రోహుల జేబు సంస్థ ఎన్‌ఐఏ ముస్లింలను దేశద్రోహులని ఆరోపించడమా?

నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది.  హైదరాబాదులోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు  నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది.నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ముస్లింలకు లీగర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు
సాహిత్యం సమీక్షలు

మంజీర.. స‌జీవధార

చెరబండరాజు సాహిత్య సర్వస్వం, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ విశ్లేషణ ‘కల్లోల కవితా శిల్పం’ పనిలో ఉన్నప్పుడు వీరిద్దరికి కొనసాగింపుగా కౌముది, సముద్రుడు, మంజీర, ఎమ్మెస్సార్‌ గుర్తుకు వచ్చారు. విప్లవ కవిత్వంలోకి చెర, అలిశెట్టి ప్రభాకర్‌ తీసుకొచ్చిన విప్లవ వస్తు శిల్పాలు ఆ తర్వాతి కాలంలో మరింత గాఢంగా, ఆర్దృంగా, సౌందర్యభరితంగా విస్తరించాయి. 1990ల విప్లవ కవిత్వం మొత్తంగా తెలుగు కవితా చరిత్రనే సాంద్రభరితం చేసింది. ఇందులో అనేక మంది విప్లవ కవులు ఉన్నారు. వాళ్లలో కూడా ప్రత్యక్ష విప్లవాచరణను, కవితా రచనను ఎన్నుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణ నేపథ్యం, విభిన్న రంగాల్లో పోరాట అనుభవం,
వ్యాసాలు

కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పోరేషన్స్ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే "కార్పోరేషన్ కు ఆత్మ అంటూ ఉండదు" (a corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పోరేషన్స్ కు మార్కెట్ విలువ తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి
వ్యాసాలు

కార్పొరేట్‌ రాజకీయాలు-ప్రత్యామ్నాయం : సిలింగేర్‌ ఉదాహరణ

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో కార్పొరేటీకరణ ఒకటి. హిందుత్వ ఫాసిజంలాగే ఈ మాట కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తయారు చేస్తున్నదనే అవగాహనకు ఇప్పుడు సాధారణ పరిశీలకులు కూడా వచ్చారు. ఆదానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి వచ్చాడనే వార్తతో పాపులర్‌ మీడియాలో కూడా కార్పొరేటీకరణ గురించిన చర్చ మొదలైంది. దేశ సంపదను  సంపన్నులకు  ప్రభుత్వం  కట్టబెట్టడం ఏమిటనే విమర్శ
వ్యాసాలు

రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి

కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ అమర్ రహే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహాసాలతో పోరాడిన జాతీయ విప్లవకారులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ ఒకరు. ఆయన కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలసి జైలులో అమరణ నిరహార దీక్షకు పూనుకొని 63 రోజుల తరువాత అసువులు బాసాడు. అంతర్జాతీయంగా మార్చ్ 18ని రాజకీయ ఖైదీల దినంగా పాటించడం మూడవ ఇంటర్నేషనల్ ప్రకటించిన విషయం విదితమే. ఆ పరంపరను కొనసాగిస్తూనే వారి త్యాగాల సృతిలో ఖైదీల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 13ను పోరాట దినంగా పాటించడం పరిపాటైంది. భారతదేశ విప్లవోద్యమంలో తమ ఆశయాల సాధనకై
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
సంభాషణ

ఆయుధాల బలంపై అధికారాన్ని నిలుపుకోలేరు

ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి....... మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు! పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం. పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం? గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు? వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం