సాహిత్యం కవిత్వం

చిన్ని ఆశ

వెన్నెముక విరిగినంతబాధల్లోపురిటినొప్పులతోఅర్ధరాత్రి పుట్టాను నేను నా పుట్టుక తెల్లవారాకేనా బంధు మిత్రులకి తెలిసిందినాడు సమాచార వ్యవస్థ నేటి లా లేదు సుమా! తెలిసీ తెలియ గానే కేరింతల్లోనా శ్రేయస్సు కోరే వారంతాఏం జరిగిందిఏం జరగబోతోంది తెలియని తనం లోవర్తమాన కోలాహలం చరిత్ర పునాది గా తొలినాళ్ళలో అంబాడుతూ పడుతూ లేస్తూబులిబులి నడకలతో తప్పటడడుగులతో నేనుతప్పొప్పుల బేరీజు తోభారీ ప్రణాళికలతో తల్లితండ్రులునా ఉజ్జ్వల భవిష్యత్తు కోసం రచనలు నిర్విరామంగా ఎదుగుతున్న కొద్దీనాకోసం ఆస్తుల సృష్టినా ఆధీనంలో ఎన్నో కర్మాగారాలు సంస్థలుఇరుగు పొరుగు తో సత్సంబంధాలునెలకొల్పుకుంటూసామ దాన భేద దండోపాయాల తో ముదిమి వయస్సు లోకొడుకులు నా ఆలనాపాలనా గాలికొదిలినా ఆస్తులు
వ్యాసాలు

ఆదివాసీ విద్యార్థుల మరణాలు

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము అని చెప్పుకుంటున్న గురుకులాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలలు, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ హాస్టళ్లు పేద విద్యార్థుల పట్ల శాపంగ మారాయి. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ కేసులు వందలలో నమోదు కాగా వేల మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అనారోగ్యం బారిన పడినారు. ఈ పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో అత్యంత తీవ్రంగా ఉంది. ఫుడ్‌ ఫాయిజన్‌ ఘటనలతో పాటు ఈ జిల్లాలలో ఆగస్టు నెలలో ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, గురుకులాలలో జ్వరంబారిన పడి నలుగురు విద్యార్థులు చనిపోవడం
సాహిత్యం కవిత్వం

అత్యంత సున్నితమైనది

పలకమీదఅక్షరాలనుతుడిపేసినట్టుహృదయంలోబంధాల జ్ఞాపకాలనుచెరిపేయగలమా..! అంతరంగంఅర్ధమైనప్పుడుఆశ శ్వాసఅందనంత దూరమైపోతుంది..! అబద్దాన్నినిజంగా నమ్మించొచ్చునిజాన్నిఅందరికితెలియనీయకపోవచ్చుఎల్లప్పుడుచికటేవుండదుగా..! తనడప్పుదరువునీ గుండెను తాకలేదా..?తనగొంతులో గానంనీ చూపు దిశను మార్చలేకపోయిందా..? తను నీవొడిలో తలవాల్చిబిడ్డలా వొదిగిపోయినప్పుడునువు తలనిమిరింది నాటకమేనా..? మానవ సంబంధాల్లోఅత్యంత సున్నితమైనదిసహచరి సహచరుడు బంధమే..! దానిని గండ్రగొడ్డలితో నరికిఅందరిని ఆశ్చర్యంలోముంచేసిన అమావాశవి..! ప్రజలదారిలో నీ నడకలేదనికాలక్రమంలో బహిర్గతమయ్యింది..! ఏబంధం లేని కరచాలానికేకలచివేస్తున్నప్పుడుకనుపాపలా చూసిన చూపుకికన్నీరే మిగిల్చావు..!
సాహిత్యం సమీక్షలు

విప్లవోద్యమాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 - 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా
సాహిత్యం కథలు హస్బెండ్ స్టిచ్ - 3

మాట్లాడు!!

నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను మాట్లాడు... మాట్లాడు స్నేహితుడిలా... ప్రేమికుడిలా... సహచరుడిలా రోజూ నన్ను పలకరించే తోటలోని గువ్వలా... మాట్లాడు... మాట్లాడు - స్వర “ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే... ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా...?” కోపపు ఎమోజీ ఎర్రగా... చిరాగ్గా కార్తీక్ నుంచి. స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ లేవా తమ మధ్య మాటలు...? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి... రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య... సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ
సాహిత్యం కథావరణం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం