కవిత్వం

సికాస నిప్పు

విచ్చుకత్తుల బోనులో శత్రువుతో చెడుగుడు ఆడి బొగ్గు గనుల్లో ఉద్యమ ఊపిరులు ఊది సింగరేణిలో విప్లవ మంటలను రాజేసిన సికాస సింహం నీవు నూనూగు మీసాల నవ యవ్వనంలో జగిత్యాల జైత్రయాత్రవై ఇంద్రవెళ్లి తుడుం మోతవై ఆదివాసీ అగ్గిబరాటవై జనతన సర్కారు నిర్మాతవై శ్రామిక రాజ్యపు సారధివై ఎత్తిన ఎర్రజెండాను యాభై ఏళ్లుగా విరామమెరుగక మోసిన విప్లవ ప్రేమికుడివి నీవు పాలక పోలీసు ఎత్తుగడలను చిత్తు చేస్తూ, చివరి వరకు శత్రువుకు చిక్కని 68 ఏళ్ల చిచ్చర పిడుగువు సింగరేణిలో రాజుకొని దేశమంతా వెలుగులు జిమ్మిన సికాస నిప్పువు నీవు వసంత గీతమై వెదురుగానమై దండకారణ్యమంతా విస్తరించిన దూద్
కవిత్వం

ఎదురు వనము ఎంట దెచ్చిన..

యాలపొద్దున యేరు దాటిన చిరుత నోటిిని చీల్చి లేచిన.. డ్రోను డేగల కూల్చి వేసిన.. దొంగ దాడుల శత్రు మూకల.. నేల గూల్చి నేరు గొచ్చిన.. ఎదురు పొదల ఎంట దెచ్చిన.. దారి జూపే దుసురు తీగా.. దూప దీర్చే మోదుగాకూ.. మాటు గాయే మడ్డి చెట్టూ.. గుట్టు జెప్పే బోడు మిట్ట.. వొడిల దాచిన గుండ్లు వడిసెలు.. మోపు గట్టిన ర్యాల పండ్లూ.. మాగ బెట్టిన శీత ఫలమూ.. పైలమేనా ఆ కాయలన్నీ.. కత్తు వెంట కాలి బాట దింపి పంపే జారు బండ.. వొంపు దేలిన మా డొంక తల్లీ.. వోదలి వస్తనే వనం బిడ్డల..
వ్యాసాలు

పత్రికలతో ఇంటర్వ్యూలను  ప్రారంభించిన తొలి మావోయిస్టు అగ్రనేత 

కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుదర్శన్ తన ఏకైక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. అరవై తొమ్మిదేళ్ల సిపిఐ (మావోయిస్ట్) అగ్రనేత, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ బహుశా అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్‌కి చెందిన కనిపించే ముఖాలలో ఒకరు. అతను అడవుల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే సంస్కృతిని ప్రారంభించాడు. కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అప్పటి నక్సల్స్ ప్రభావిత మానాల అడవిలో 1996 సెప్టెంబర్‌లో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ  జరిగింది. నేను సెప్టెంబరు 1996లో
స్పందన

ఐదు దశాబ్దాల విప్లవోద్యమ అనుభవం

తేదీ 31 మే, భారత విప్లవోద్యమ చరిత్రలో మరో తీవ్ర విషాద దినంగా నమోదైంది. కామ్రేడ్‌ ఆనంద్‌ (కటకం సుదర్శన్‌, దూలాదా) అనారోగ్యంతో 69వ ఏట కన్ను మూశాడని జూన్‌ 5 నాడు వార్తలలో చూసి నిర్ఘాంతపోయాను. ‘‘మన దేశాంలో చైనా అనుభవాలు మక్కికిమక్కి లేదా కొన్ని సవరణలతో అన్వయిస్తే సరైన ఫలితాలు రావు. మన దేశ నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి విప్లవోద్యమాన్ని నిర్వహించాలి. మూడు రంగాలలో ఎత్తుగడలు నూతనంగానే ఉండాలి. మనం ఈ నిర్బంధంలో నిర్మించే సంఘాలు ఒక కొత్త తరహాలో ఉండాలి. గతంలో మనకు లేని ప్రయోగాలు చేయాలి’’. అనే అభిప్రాయం ఆయనకు ఉండేది. తాత్కాలిక
కవిత్వం

ఆనంద్

అతని అక్షరాలుఅనంత కోటి పీడితజనహృదయ వేదనలోవెలిసిన నక్షత్రాలువెలుగు ఇవ్వటమే వాటి పని అతని అక్షరాలుప్రజల ప్రతిఘటన పోరులోచెక్కిన శిల్పాలురేపటి చరిత్రకు మూలాలు అతని అక్షరాలుఅమరుల రక్తములోతడిసిన విత్తనాలు ఏ పొలంలో చల్లినాఆయుధాలే మొలుస్తాయి
పాట

విప్లవ జోహార్లు కటకం సుదర్శన

దండాలు దండాలు మా కటకమ నీకెర్ర దండాలు సుదర్శన జోహార్లు జోహార్లు మా కటకమ విప్లవ జోహార్లు సుదర్శన విప్లవానికే అంకితమైన...... యాభైయేండ్ల అజ్ఞాత జీవితమ..."దండాలు" కన్నాల బస్తిలో పుట్టినవు కారడవికి నీవు చేరినవు కామ్రేడుగా నీవు మారినవు కేంధ్ర నేతగా ఎదిగినవు నమ్మిన దారిలో నడిచినవు.... కన్నుమూసేవరకు పోరినవు...."దండాలు" మావోయిస్టు సిద్దాంతమా ప్రజాయుద్ధా మార్గానివీ గెరిల్లా పోరు వ్యూహానివి మాటు దాడుల మర్మానివి దండకారణ్యం గుండె కాయవు...... ఎర్రజెండా అరుణతారవు....."దండాలు" ఎర్ర దండు నడకవు నీవు పోరుబాట జాడవు నీవు ఉధ్యమాల ఊటవు నీవు విప్లవాల తోటవు నీవు అమర వీరుల కలలవు నీవు.... ఆశయాల బాటవు
కవిత్వం

విప్లవ కటకం!

తాను చిరునవ్వు,చిరునామా,రాజ్య భోజ్య భస్మ ప్రాకారాల నిర్మిత కటకం….తాను దూరతీరాల సుదర్శన జనతన జాగృత ఆనంద దాయక కటకం…..విచ్చితి చిత్తంబుల చిరు కానుకుల ఘనీభవించే ఘీంకార కటకం….దారిద్రయ విముక్త దర్శన భాగ్యపు కథ కథల కటకం….అహో నావయవ్వన లోకపు దృక్పథాల చరమగీతపుహాహాకారపు కటకం….వస్తున్న వీస్తున్న దండకార్యపు కార్యకదనపు కటకం…..కనుల కావ్యపు కాలాతీత కార్యం ప్రమోద ప్రధాన ప్రదీప కటకం……విప్లవ కటకం అది విప్లవకటకం….
కవిత్వం

లేచి రా సారూ

ఏభై ఏళ్ళ మీ ఉద్యమ‌ ప్రయాణానికిసెలవంటూ నిష్ర్కమించారా మీ చేతులలో పెరిగినఎన్నెన్ని పోరాట రూపాలు మొక్కవోని మీగుండె నిబ్బరం చివరి శ్వాసవరకూ రాస్తూనే వుందన్నవార్త మీ ఆచరణకు గీటురాయి వసంత గీతంఆలపిస్తూ సాగినమీ నడక యీ అసహనఅపసవ్య వేళలోఆగిపోయి మమ్మల్నిఒంటరి చేసారు కదా సారూ ఈ ఏరువాకపున్నమి రోజు మరలమీరు సేద్యం చేయఈ నాగేటి చాళ్ళలోఉదయిస్తారు కదూ!! లే లేచి రా సారూమీ ఆకు పచ్చని ఎర్ర చుక్క టోపీధరించి ఏకే‌ అందుకునిధూలా ఆడుదురు (కామ్రేడ్ సుదర్శన్ సారుకు వినమ్ర జోహార్లతో)
కవిత్వం

నల్ల కలువ..!

అదితెలంగాణ నేల విముక్తి కోసంసాగిన సాయుధ రైతాంగ పోరాట కాలమదిదేశ ముఖ చిత్రాన్ని కర్రు నాగలితోచెక్కినవసంత మేఘ గర్జనలోపల్లెలన్నీ తడిసాయి..ఆ వర్షపు జల్లుఅన్ని పల్లెల్ని కలిపాయి..ఆ ధారగోదావరికి తాకింది.. నాటిగొండ్వాన రాజ్యంనుస్పూర్ సంస్థానంమావో నాటే - మావో రాజ్(రాజ్యం) లోపురుడోసుకున్న కటకం.! ఎన్నిఅంతరాల దొంతరలున్నవ్యవస్థలోఅతనోఒక నల్ల కలువఈ నేల మాగానపునల్ల రేగడిసింగరేణినల్ల బంగారంపు రుపుఈ దేశపు వెలుగుఅతను.. ఆరు పదులు దాటిననాలుగు పదుల ఉద్యమంనాలుగు పాదాల రాజ్యాన్నిదిక్కరించిన సుదర్శనంఅతను. అతనుఎవరని చెప్పాలిఒక విద్యార్థి ఉద్యమమనా..ఒక సికాసా అనా..ఒక రైతాంగ కార్యకర్త అనా..నల్ల ఆదిరెడ్డి, రాజలింగం సోపతాఅతను ఎవరని చెప్పాలి.ఎన్ని అని చెప్పాలి.ఏమని చెప్పాలి అతనోఉద్యమంఅతనోయుద్ధ గీతికఅతనోవిముక్తి బాటఅతనోగెరిల్లా..అతనేకటకం సుదర్శన్అతనేపోరుబాటకు
దండకారణ్య సమయం

దండకారణ్య నిర్మాణ చిత్తరువు

నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమాన్ని ప్రజాపంథాలో పునర్నిర్మించడానికి అట్టడుగు స్థాయి నుంచి ప్రయత్నించిన నాయకుల్లో కటకం సుదర్శన్‌ ఒకరు. ఆనంద్‌ పేరుతో ఆయన సింగరేణి బొగ్గుబాయిల నుంచి, బస్తీల నుంచి, కళాశాలల నుంచి, పల్లెల నుంచి పని ఆరంభించి ప్రజాపంథాను సృజనాత్మకంగా ఆవిష్కరించి గోదావరి తీరం దాటించి దండకారణ్యం దాకా విస్తరింపజేశాడు. అక్కడి నుంచి వివిధ రంగాల్లో తన సహచరులతో కలిసి దేశవ్యాప్తం చేశారు. ఆచరణలో వర్గపోరాటం ఎన్నెన్ని తలాల్లో, ఎన్నెన్ని రూపాల్లో సాగడానికి అవకాశం ఉన్నదో నిరూపణ కావడానికి ఆయన అజరామర నాయకత్వం దోహదం చేసింది. ప్రత్యామ్నాయ ప్రజాఽధికారం, కింది నుంచి ప్రజాస్వామ్యం, అన్ని