కవిత్వం

సికాస నిప్పు

విచ్చుకత్తుల బోనులో శత్రువుతో చెడుగుడు ఆడి బొగ్గు గనుల్లో ఉద్యమ ఊపిరులు ఊది సింగరేణిలో విప్లవ మంటలను రాజేసిన సికాస సింహం నీవు నూనూగు మీసాల నవ యవ్వనంలో జగిత్యాల జైత్రయాత్రవై ఇంద్రవెళ్లి తుడుం మోతవై ఆదివాసీ అగ్గిబరాటవై జనతన సర్కారు నిర్మాతవై శ్రామిక రాజ్యపు సారధివై ఎత్తిన ఎర్రజెండాను యాభై ఏళ్లుగా విరామమెరుగక మోసిన విప్లవ ప్రేమికుడివి నీవు పాలక పోలీసు ఎత్తుగడలను చిత్తు చేస్తూ, చివరి వరకు శత్రువుకు చిక్కని 68 ఏళ్ల చిచ్చర పిడుగువు సింగరేణిలో రాజుకొని దేశమంతా వెలుగులు జిమ్మిన సికాస నిప్పువు నీవు వసంత గీతమై వెదురుగానమై దండకారణ్యమంతా విస్తరించిన దూద్
కవిత్వం

దేశమంతా నెత్తురు వాసన

దేశమంతా నెత్తురు వాసనఆ మూల, ఈ మూలదేశం నలుమూలలఏ మూల చూసినరక్తపు మరకలేనెత్తురు వాసనే. ఎనిమిదేళ్లుగా దేశంపైతోడేళ్ల మందమూకుమ్మడి దాడి,మతం పేరుతోకులం పేరుతోకూర పేరుతోనీళ్ల పేరుతోకత్తులు నెత్తుర్లుపారుస్తున్నాయి. గర్భాన్ని చీల్చిపిండాలను పొడిచినశూలంఢిల్లీ పీఠంపైరాజై కూసింది.రాజ్యంలో రక్తం వాసనమేఘంలా ముసురుకుంది.