విచ్చుకత్తుల బోనులో
శత్రువుతో చెడుగుడు ఆడి
బొగ్గు గనుల్లో ఉద్యమ
ఊపిరులు ఊది
సింగరేణిలో
విప్లవ మంటలను రాజేసిన 
సికాస సింహం నీవు

నూనూగు మీసాల
నవ యవ్వనంలో
జగిత్యాల జైత్రయాత్రవై 
ఇంద్రవెళ్లి తుడుం మోతవై
ఆదివాసీ అగ్గిబరాటవై
జనతన సర్కారు నిర్మాతవై
శ్రామిక రాజ్యపు సారధివై
ఎత్తిన ఎర్రజెండాను
యాభై ఏళ్లుగా
విరామమెరుగక 
మోసిన విప్లవ ప్రేమికుడివి నీవు

పాలక పోలీసు ఎత్తుగడలను
చిత్తు చేస్తూ, చివరి వరకు
శత్రువుకు చిక్కని 68 ఏళ్ల
చిచ్చర పిడుగువు
సింగరేణిలో రాజుకొని
దేశమంతా వెలుగులు జిమ్మిన
సికాస నిప్పువు నీవు

వసంత గీతమై
వెదురుగానమై
దండకారణ్యమంతా విస్తరించిన
దూద్ దాదావి నీవు

ఓ మా కామ్రేడా కటకం..
వీరులు మరణించరు
అస్తమిస్తారు
లేలేత ఉషోదయ కిరణాలై 
నవయవ్వన ఉత్తేజంతో
తిరిగి మళ్ళీ మళ్ళీ ప్రభవించడానికి.

Leave a Reply