దండకారణ్య సమయం

దండకారణ్య నిర్మాణ చిత్తరువు

నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమాన్ని ప్రజాపంథాలో పునర్నిర్మించడానికి అట్టడుగు స్థాయి నుంచి ప్రయత్నించిన నాయకుల్లో కటకం సుదర్శన్‌ ఒకరు. ఆనంద్‌ పేరుతో ఆయన సింగరేణి బొగ్గుబాయిల నుంచి, బస్తీల నుంచి, కళాశాలల నుంచి, పల్లెల నుంచి పని ఆరంభించి ప్రజాపంథాను సృజనాత్మకంగా ఆవిష్కరించి గోదావరి తీరం దాటించి దండకారణ్యం దాకా విస్తరింపజేశాడు. అక్కడి నుంచి వివిధ రంగాల్లో తన సహచరులతో కలిసి దేశవ్యాప్తం చేశారు. ఆచరణలో వర్గపోరాటం ఎన్నెన్ని తలాల్లో, ఎన్నెన్ని రూపాల్లో సాగడానికి అవకాశం ఉన్నదో నిరూపణ కావడానికి ఆయన అజరామర నాయకత్వం దోహదం చేసింది. ప్రత్యామ్నాయ ప్రజాఽధికారం, కింది నుంచి ప్రజాస్వామ్యం, అన్ని