దాచేస్తే దాగని యుద్ధం
ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి. రాజ వంశీకులకు ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక