లోచూపు కాలమ్స్

అంటరానితనం గాయాలకు అక్షరభాష్యం ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’

ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి. ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన
వ్యాసాలు

దండ‌కార‌ణ్యం అప్‌డేట్స్‌

కొవిడ్ మానవాళికి కొత్త అనుభవం. కరోనా అనంతర చరిత్ర అనగల స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. ఇందులో కొంత విశ్లేషణ ఉంది. చాలా వరకు ఊహ ఉంది. తొలి దశ కరోనా బీభత్సం మధ్యనే అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. ట్రంప్ దిగిపోయి, జో బిడెన్ అధికారంలోకి వచ్చాడు. ప్రపంచ రాజకీయార్థిక సమీకరణాలు కొత్త దశలోకి మళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరోనా వచ్చినా, బిడెన్ వచ్చినా పాలస్తీనా పరిస్థితి ఏమీ మారదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన మొన్న ఒక మాట అన్నాడు. ఇజ్రాయిల్‌కు  తన ప్రయోజనాల కోసం పోరాటే హక్కు ఉందని
సంపాదకీయం

ల‌క్ష ద్వీప్ కోసం మాట్లాడ‌దాం

లక్ష ద్వీప్ మనకు పడమట దిక్కున ఉన్న దీవులు. ముప్పై ఆరు దీవుల సమూహం. డెబ్భై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం. 97 శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుంది. మిగతా మూడు శాతం బయటి నుండి వచ్చిన వారు. అక్కడ గత కొన్ని వారాలుగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కారణం తమ నేల నుండి తమని పరాయి వారిని చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతలకు ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారులను పరిపాలన అధికారులుగా రాష్ట్రపతి నియమిస్తారు. కానీ గత డిసెంబర్లో గుజరాత్ కు చెందిన భాజపా నేత ప్రఫుల్ ఖోడా