(విప్ల‌వోద్య‌మ స్థావ‌రాల‌లో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ నుంచి సాగుతున్న నూత‌న సంస్కృతీ వికాసాన్ని వివ‌రిస్తూ ప్ర‌గ‌తి సుదీర్ఘ వ్యాసం రాశారు.ఈ వ్యాసంలోని  కొన్ని  భాగాలు మీ  కోసం – వ‌సంత‌మేఘం  టీం) 


మన దేశంలోని ప్రజాస్వామిక విప్లవానికి దాదాపు 160 సంవత్సరాలకు పైబడిన చరిత్రఉంది. నిర్ధిష్టంగా మన దేశంలో దీర్హకాల ప్రజా వ‌ర్గ‌పోరాటానికి  50 సంవత్సరాలకు పైబడినచరిత్రే ఉంది.   ల‌క్ష‌లాది మంది భాగ‌స్వామ్యంతో, వేలాది మంది అమ‌ర‌త్వంతో   ఒక నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో  నూతన కళా సంస్కృతుల వికాసం జ‌రుగుతున్న‌ది.  అది, నూతన ప్రజాసంస్కృతికి పునాదులు వేసింది. వాటిని మనం మరింత బలోపేతం చేస్తూ ప్రజల ప్రజాస్వామికసమాజ నిర్మాణ దిశలో, దోపిడీ రహిత సమాజ ఆవిర్భావానికి అంకితం చేయాలి. దానినేమనం ప్రజల సంస్కృతి లేదా విప్లవ సంస్కృతి అంటాం.

కాబట్టి మొట్టమొదట మనం అసలు సంస్కృతి అంటే ఏమిటో దాని గురించి ఒక్కమాటలోఇలా చెప్పుకుందాం: “సమాజంలోని భౌతిక ఉత్పత్తులు అ సమాజానికి పునాదులు కాగా,బౌద్ధిక ఉత్పత్తులను సంస్కృతిగా చెప్పుకోవచ్చు”. లేదా ఉత్పత్తి సంబంధాల సమష్టి రూపమైనసామాజిక అర్థిక వ్యవస్థ మనుషుల సామాజిక జీవితానికంతటికీ పునాది, పునాదిని బట్టి ఏర్పడేమనుషుల సామాజిక చైతన్యరూపాలన్నీ ఉపరి నిర్మాణంగా చెప్పుకుంటాం. 


మ‌రో మాటలో ఇవి న్యాయసూత్ర సంబంధమైనవి, రాజకీయపరమైనవి, న్యాయపరమైనవి, కళా సౌందర్యానికి చెందినవి, తత్వ సంబంధమైనవి – ఇలా సామాజిక చైతన్యం యొక్క నిశ్చిత రూపాలన్నీవాస్తవ పునాదికి అనుగుణంగా ఉంటాయి. పునాది ప్రభావం వీటన్నిటిపైనా ఉంటుంది.అంతిమంగా వీటన్నింటిని నిర్ణయించేది పునాదే! అయితే, వీటి ప్రభావం పునాది మీద ఎంతగానోఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నపుడే పునాదికి, ఉపరి నిర్మాణానికి లేదా భౌతిక ఉత్పత్తులకు, భౌద్ధిక ఉత్పత్తులకు మరోమాటలో సంస్కృతికి మధ్యగల సంబంధం స్పష్టమవుతుంది. ఈ  వ‌ర్గ‌పోరాట‌ అవగాహనను ముందు అర్థం చేసుకుంటే దాని వెన్నంటే వర్గ సమాజంలో కళలు, సాహిత్యం లేదా సంస్కృతి ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

దీనిని అర్థం చేసుకొవడానికి తన సుప్రసిద్ధమైన ‘కళలు సాహిత్యంపై యేనాన్‌లో చేసిన ప్రసంగం’లో కామ్రేడ్‌ మావో ఏం చెప్పాడో చూద్దాం.


“వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం నిర్ధిష్ట వర్గాల, రాజకీయాల ప్రయోజనాలకోసమే ఉద్ధేశించబడినవి. వాస్తవంగా కళ కళ కోసమంటూ ఏదీ లేదు. వర్గాలకు లేదా రాజకీయాలకు అతీతంగా ఏ కళా లేదు. కామ్రేడ్‌ లెనిన్‌ చెప్పినట్టు మొత్తం ఒక యంత్రంలోభాగమైన పళ్లూ, చక్రాల్లాగే సమస్త శ్రామిక వర్గ ప్రయోజనాలలో భాగమే కార్మికవర్గ సాహిత్యంకళలు”. అంటే వర్తమాన దోపిడీ ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం అ దోపిడీ వర్గాలప్రయోజనాలనే ఈడేరుస్తాయని అర్థం చేసుకోవాలి. అలా అనుకున్నపుడు దోపిడి సమాజంలోనిపునాదికి దాని ఉపరి నిర్మాణంలోని సంస్కృతి సేవ చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆసామాజిక భౌతిక ఉత్పత్తులను పరిరక్షించడానికి, పెంపొందించడానికి బౌద్ధిక ఉత్పత్తులైనకళలూ సాహిత్యం తదితరాలు అంకితమవుతాయి. అవి ప్రజలను గాఢంగా ప్రభావితం చేస్తాయి.వాటి ఫలితమే సమాజంలో శాస్త్రీయ  అవగాహనలు ప్రజలకు ప్రధానంగా పునాది వర్గాలవారికి అందకపోవడం! వారు మత మౌఢ్యం, అంధ విశ్వాసాలలో కూరుకపోయి, నిరుపేదలకుఅక్షర జ్ఞానం కూడా చాలా వరకు కరువై ఉండడం! అలాంటి  శ్ర‌మజీవులను సమీకరించడానికి,సంఘటితీకరించడానికి, విష్లవించడానికి మనకు విప్లవ కళలు, సాహిత్యం, సంస్కృతి కావాలి.వాటిని ఆయుధాలుగా మలచగలిగే శక్తులు (సాంస్కృతిక సైన్యం) కావాలి. అ విషయప్రాధాన్యతను మనకు మావో ఇలా బోధించాడు.


“విశాల విప్లవ ప్రజారాసులకు విప్లవ సంస్కృతి అనేది ఒక శక్తిమంతమైన విప్లవ ఆయుధం. విప్లవానికి ముందు అది భావజాల రంగంలో భూమికను తయారుచేస్తుంది, కాగా విప్లవకాలంలో అది సాధారణ యుద్ధ రంగంలో ఒక ముఖ్యమైన, అవశ్యమైన పోరాట రంగం”.(మావో నూతన ప్రజాస్వామికం-మావో) పై మావో బోధనలను మనం లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలె. అలాగేమన దేశ చరిత్రను, సంస్కృతిని కూడా మనం తెలుసుకోవాలె. ఎందుకంటే,  *దేశంలో విప్లవాత్మకపరిస్థితి ఉందని ప్రజానీకానికి తెలియజేయడం, అ పరిస్థితి విస్తృతిని గురించి ప్రగాఢ‌తనుగురించి వివరించి చెప్పడం, శ్రామికవర్గంలోని విప్లవాత్మక చైతన్యాన్ని విప్లవాత్మక దృఢ నిశ్చయాన్నిమేలుకొల్పడం, అది విప్లవ చర్యలకు దిగేటందుకు సహాయపడటం, అందుకోసం విప్లవాత్మకపరిస్థితికి తగిన సంఘాలను ఏర్పర్చడం సోషలిస్టులందరి ప్రధాన కర్తవ్యం* అన్నాడు కామ్రేడ్ లెనిన్‌.


మన ప్రియమైన భారత దేశం అనేక భాషలకు, పలు మతాలకు, అనేక అదివాసీ సముదాయాలకు ( వికసిస్తున్న/అవిర్భావ జాతులకు), భిన్న సంస్కృతులకు నిలయం. అనేక జాతులతో విలసిల్లుతున్న దేశం మనది. మన దేశ జనాభా 140 కోట్లను దాటనుంది. ఈరకమైన మన దేశ వైవిధ్యాన్ని ముందుగా మనం  అర్ధం చేసుకోవాలి. ప్రపంచప్రజలందరిలాగే మన దేశ ప్రజలు కూడా అత్యంత ప్రజాస్వామ్య ప్రియులు, గొప్ప పోరాటవారసులు. మన దేశంలో బ్రాహ్మణ్యానికి వ్యతిరేకంగా క్రీస్తు పూర్వమే చార్వాకులు ధ్వజమెత్తారు. మన దేశ వేదాలను నిలదీసిన చరిత్ర లౌకికవాదానికి భౌతిక వాదానికి ఉంది. మన దేశప్రజలు జరిపిన ప్రగతిశీల పోరాటాలలో నుండి క్రీస్తు పూర్వమే నూతనంగా బౌద్దం, ఆ తరువాత క్రీస్తు శకం 14వ శతాబ్దంలో సిక్కు లాంటి మతాలు ఆవిర్భవించాయి. బ్రాహ్మణీయ అధిపత్యానికి కుల సంకెళ్లకు సవాళ్లు విసురుతూ మన దేశంలో చెలరేగిన భక్తి ఉద్యమాలుకుల రహిత సమాజ భావనను ముందుకు తెచ్చి శ్రామిక ప్రజలలో సోదర భావాన్ని ఎత్తిపట్టాయి. కాలం చెల్లిన, ప్రగతి నిరోధకమైన కరుడుగట్టిన బ్రాహ్మణ మతాన్ని చార్వాకుల నాటి నుండిఎదిరిస్తూ, ఖండిస్తూ, వివిధ సందర్భాలలో ఓడిస్తూ వచ్చిన ప్రజలు, ఆ తరువాత బ్రిటిష్‌సామ్రాజ్యవాదులనూ ఎదిరిస్తూ దేశంలో ప్రజాస్వామిక విప్లవ తరంగాలను నిలుపుతూ వచ్చారు.మన దేశం నిరంతరం ప్రజా పోరాటాలలో ప్రజ్బరిల్లింది. వాటి ఫలితంగానే తుదకు మనదేశం నుండి వలసాధిపతులు 1947లో తెరమరుగు కాక తప్పలేదు. అందుకు ప్రపంచపరిస్థితులు ఎంతగానో దోహదపడ్డాయి. దేశంలో బలమైన విష్లవోద్యమం రూపొందకపోవడంతో అ నామమాత్ర స్వాంతంత్రమే దేశ స్వతంత్రంగా ప్రజల మననులలోనాటుకుపోయింది.


మన దేశ యావ‌త్  ప్ర‌జ‌ల పోరాటాలలో ఆదివాసీ ప్రజా తిరుగుబాట్లు గొప్ప విశిష్టతను క‌లిగి  ఉన్నాయి. క్రీస్తు పూర్వం సాగిన మౌర్య సామ్రాజ్య విస్తరణను అడ్డుకొని “యుద్ధ పిపాసి”అశోకుడి పురోగమనాన్ని కళింగ యుద్ధంలో నిలిపివేసిన నాటి నుండి 19వ శతాబ్దం తొలిసగంలో గేంద్‌ సింగ్‌, బిర్సా ముండాలు; మలి సగంలో సడ్మెక్‌ బాబూరావు, వెంకట్రావు, సిద్దూ కానూలుు 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో గుండాదుర్‌, మలిభాగంలో కొమరం భీము లాంటి వాళ్ల వరకు నడిపిన అనేక ప్రజా పితూరీలు వీరోచిత ఆదివాసీ ప్రజలచరిత్రకెక్కాయి. అ వరుసనే సామ్రాజ్యవాదుల దోపిడీ విధానాలనే భారత పాలకులు అమలుచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల కోసం నిలిచి పోరాడి 1964లో పోలీసుల తూటాలకునేలకొరిగిన బ‌స్తర్‌ రాజు ప్రవీర్‌ చంద్ర బాంజ్‌దేవ్‌ వరకు అనేకమంది ప్రజా యోధులకు, వారి నాయకత్వంలో ప్రజా తిరుగుబాట్లకు నిలయంగా నిలిచినవే అంధ్రప్రదేశ్‌, దండకారణ్యం,బిహార్‌, జార్ఖండ్ లు. ఆ వీరయోధులతో పాటు రామరాజులాంటి దేశభక్తుల వారసులే అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దండకారణ్య, బిహార్‌, జార్ఖండ్‌ ఉద్యమ ప్రాంతాల ఆదివాసీ ప్రజలు.


అ చరిత్ర పుటల కొనసాగింపుగా 1960ల చివర్లో భారత విప్లవకారులలో ఒకరైనకామ్రేడ్‌ చారుమజుందార్‌ నాయకత్వంలో నక్సల్బరీ (పశ్చిమ బంగాల్‌) సంతాల్‌ ఆదివాసీ రైతాంగం భూమి కోసం ఉద్యమించారు. అ పోరాటం అలలు అలలుగా దేశమంతావ్యాపించింది. చిన్న నిప్పు రవ్వ దావానలంలా మారింది. విప్లవ మహా నాయకులు కామేడ్స్‌ చారు మజుందార్‌, కన్హయ ఛటర్జీల వారసత్వంలో కొన‌సాగుతున్న విప్ల‌వోద్య‌మం గత 50 సంవత్సరాలకు పైగా దేశంలో భారత నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమాన్నిపురోగమింపచేస్తున్నది. భారత దోపిడీ పాలకవర్గాల భద్రతా బలగాలను సవాలు చేస్తూ ప్రజారాజ్యాధికార స్థాపన దిశలో అనేక అటు-పోట్ల మధ్య భారత విప్లవోద్యమం కొనసాగుతోంది. 


ఈ వెలుగులో ప్రస్తుతం ఉద్యమ ప్రాంతాల పోరాట చరిత్రను, వారి సంస్కృతిని లోతుగా,సమగ్రంగా అధ్యయనం చేయాలి. దేశంలో నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమాన్ని విజయపధంలోపురోగమింపచేస్తూ అంతిమ విజయం సాధించడానికి ప్రజల ఉత్పత్తి విధానం, ఉత్పత్తిసంబంధాలలో చోటుచేసుకుంటున్న మార్పులు (వీటిని పాదార్థిక సంబంధాలు అని కూడ వ్యవహరిస్తారు) వాటిపై అధారపడి వాటికి సేవ చేసే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు,కళలు, సాహిత్యం మరోమాటలో సంస్కృతి (వీటిని భావజాల సంబంధాలు అని కూడ వ్యవహరిస్తారు) క్షుణ్ణంగా తెలసి ఉండడం చాలా అవసరం. అలా తెలిసినపుడే కాలం చెల్లినదోపిడీ వర్గాల సంస్కృతిని తుదముట్టించి దాని స్థానంలో దోపిడీ రహిత ప్రజాస్వామిక, సోషలిస్టు సంస్కృతిని నిలపడానికి చేస్తున్న మన కృషి సఫలమవుతుంది.


ప్రజల జీవితాలను మనం రెండుగా విభజిస్తే, వారి జీవితంలోని ఆర్థిక వ్యవహారాలన్నీపునాదిగానూ, దానిపై ఆధారపడి వ్యక్తమయ్యే వాటిని సంస్కృతిగానూ చెప్పుకుంటారనే మౌలికఅవగాహనను ముందే చూశాం. అంటే ఆర్థికాన్ని సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంటే, ఒకసమాజం యొక్క సంస్కృతి అ సమాజం తాలూకు ప్రజల మధ్య (ఉత్పత్తి) సంబంధాలను,ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను, తిండి తాగడం ప్రతిబింబిస్తుంది.అంటే మన దేశ సంస్కృతి విషయానికి వస్తే ఇక్కడి విశిష్టతల నేపథ్యంలోనే దీనిని అర్థంచేసుకోవాలి. మన దేశంలో దోపిడీ పాలకవర్ణాల హైందవ సంస్కృతి ఆధిపత్యంలో ఉంది.ఫలితంగా వర్గ వ్యవస్థ స్థానంలో అది సృష్టించిన వర్ణవ్యవస్థ, అందులో నుండి పుట్టుక వచ్చిననికృష్ట కుల వ్యవస్థ చిహ్నలు ప్రజల జీవితాలలోని భాషతో సహ అన్ని పార్య్యాలనుప్రతిబింబిస్తుంటాయి. కాబట్టి మన సమాజంలో మనం కేవలం వర్గ దోపిడీకి వ్యతిరేకంగానేకాకుండా లింగ, కుల దోపిడీలకు వ్యతిరేకంగా కూడా పోరాడాలి. ముఖ్యంగా కులం అనేకుత్సితమైన,  అత్యంత అప్రజాస్వామికమైనదే కాకుండా ప్రజలను నిలువునా చీలదీసే,వారి మధ్య సోదర భావానికి విఘాతాన్ని కలగించే దుష్ట వ్యవస్థ, దుర్నీతి దాని లక్షణం.  ఇదిహిందూ మతంలో తప్ప ప్రపంచంలోని ఏ మతంలో మరెక్కడా లేదు. కాబట్టి   వర్గ విముక్తి, జెండర్‌ విముక్తితో పాటు మన దేశంలో కుల విముక్తి చైతన్యాన్ని కూడా  ముందుకు తీసికెళ్లాలి. 


సంస్కృతి అనేది చాలా విశాలమైన అర్ధాన్ని కలిగి ఉంది. మనం నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేయడం అంటే, నూతన లేదా ప్రజల ప్రజాస్వామిక సంస్కృతినిపెంపొందించడమే అవుతుంది. మనం మన దేశంలో వ్యవసాయక విప్లవాన్ని కొనసాగిస్తున్నాం. ఇది దున్నే వారికే భూమి నినాదం ఇరుసుగా సాగుతున్నది. దీనిని ప్రజాస్వామిక విప్లవంగాపేర్కొంటాం. భూస్వామ్య దోపిడీని సమూలంగా రూపుమాపే విప్లవం ఇది. ఈ విప్లవం జయప్రదం కావడం ద్వారా దోపిడీకి ఒక మూల ప్రాతిపదిక అయిన ఉత్పత్తి సాధనం భూమిరైతాంగం చేతిలోకి వస్తుంది. అదే సమయంలో సామ్రాజ్యవాదుల, వారి దళారీలైన సీ.బీ.బీ.కి చెందిన కీలక, ప్రధాన పరిశ్రమలు, బ్యాంకులు జాతీయం అవుతాయి. వారి దోపిడీ కొనసాగింపుకు లేదా వారి అధికార కొనసాగింపుకు అసలైన సాధనం రాజ్యాంగ యంత్రం(పోలీసు, మిలిటరీ) ఓటమి పాలై ప్రజల ప్రజాస్వామిక రాజ్య యంత్రం రూపొందుతుంది. అంటే దేశం అర్ధ వలస అర్ధ భూస్వామ్య స్వభావాన్ని కోల్పోతుంది. దాని వెన్నంటే దానికి దన్నుగా ఉన్న సామ్రాజ్యవాదుల పరోక్ష దోపిడీ, పాలన, నియంత్రణ తొలగిపోయి దేశం వారి సంకెళ్ల నుండి నిజమైన విముక్తిని పొందుతుంది. 


తద్వార ప్రజాస్వామిక, జాతీయ విప్లవం పరిపూర్తి అవుతుంది. ఇది 1947 భారత ‘జాతీయ”’ స్వాతంత్రోద్యమానికి మౌలికంగానే పూర్తి భిన్నమైనది. అంటే ఒకవైపు దళారీ నిరంకుశ బూర్జువాల మరియు భూస్వామ్య దోపిడీ, మరోవైపు సామ్రాజ్యవాద దోపిడీ జమిలిగా సాగుతున్న నేటి వ్యవస్థ రద్దయి ఆ పునాదుల మీద ఏర్పడిన నూతన వ్యవస్థ అలంబనగా నూతన సంస్కృతి నిర్మాణమవుతుంది. ఇది భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతికి చరమగీతం పాడుతుంది. అందుకు నేటి  స్థావర ప్రాంతాలు, జనతన సర్కారులే పునాదులు అవుతాయి. ఆ నూతన సంస్కృతి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది.

మన దేశంలోని భూస్వామ్యం కులాధారితం. సమాజ వికాసంలో శ్రమ విభజన అధారంగాఇది ఉనికిలోకి వచ్చినప్పటికీ, దీని పునాదులు చాతుర్వర్ణ వ్యవస్థను నెలకొల్పిన బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంలో ఉన్నవి. ఇది దేశంలోని ప్రజల మధ్య సోదర భావం, సమానత్వం,స్వేచ్ఛ‌,  స్వతంత్రతలకు అడ్డుగోడగా నిలిచింది. దేశ ప్రజలపై కొనసాగుతున్న తీవ్ర దోపిడీ, అసమానతలకు కారణమైన ఉత్పత్తి సాధనాల యాజమాన్యం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వార పీడిత ప్రజల చేతులలోకి మారినప్పటికీ వారి మధ్య సాంస్కృతికంగా అసమానతలకు, ఎక్కువ తక్కువలకు, గొప్ప, హీన భేదభావాలకు కేంద్రంగా నిలిచిన కుల వ్యవస్థ పునాదులు విచ్చిన్నం కావడానికి వాటిని నామరూపాలు లేకుండా చేయడానికి కావలసిన ప్రాతిపాదికను నూతన ప్రజాతంత్ర విప్లవం ఏర్పరుస్తుంది.


మన దేశం కశ్మీర్‌ ఈశాన్య రాష్ట్రాల బలవంత విలీనాలతో ఒక జాతుల బందీఖానాగామారింది. దేశ దోపిడీ పాలక వర్గాలు, సామ్రాజ్యవాదులు కుమ్మక్కై దేశంలోని భిన్న జాతులవికాసాన్ని నిరంకుశంగా అడ్డుకుంటున్నవి. దేశంలో భిన్న జాతుల ఉనికినే కాదంటూ కల్పితమైనభారత జాతిని నిలపడానికి దోపిడీ పాలకవర్గాలు 1947 అధికార మార్చిడి తర్వాతి నుండితమ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేశాయి. ఆ ప్రయత్నాల పరాకాష్టగా నేడు కేంద్రంలోనిహిందుత్వ శక్తులు అన్ని రంగాలలో “ఏక్‌ భారత్‌- శ్రేష్ట్‌ భారత్‌ నినాదాన్ని ముందుకు తెస్తూ’నయాభారత్‌’ నిర్మాణ లక్ష్యాన్ని ప్రకటిస్తున్నాయి. ఇవి ‘హిందూ, హిందీ, హిందుస్తాన్‌ అనేకృత్రిమ భావాలను దేశ జనాభాపై రుద్దుతూ దేశ వైవిధ్యాన్నీ ధ్వంసం చేస్తున్నవి. భాషలవికాసాన్నీ లౌకిక భావాలనూ వ్యక్తిగతమైన మత స్వేచ్ఛ‌ను, భావ ప్రకటన స్వేచ్ఛ‌నుఅడ్డుకుంటున్నవి. ఆహారపు అలవాట్లను, జన సంప్రదాయ జీవన విలువలను కాదంటూపరాయితనాన్ని దౌర్జన్య పూరితంగా, హింసాయుతంగా రుద్దుతున్నవి. ఈ వైఖరి తామురాసుకున్న భారత లిఖిత రాజ్యాంగానికే భిన్నమైనది. వారు భారత రాజ్యాంగం ప్రజలకుఇచ్చిన హామీలను ఖాతర చేయడం లేదు. హిందుత్వ ఫాసిస్టు విధానాలన్నింటిని ఎదుర్కొంటూ,ఓడిస్తూ నూతన ప్రజాతంత్ర విప్లవం జాతుల స్వతంత్రతను, సార్వభౌమాధికారాన్ని నిద్వంద్వంగాఎత్తిపడుతుంది. కాబట్టి దేశంలోని పీడిత జాతులతో నమైక్యమై, వారి పోరాటాలతో భుజం-భుజం కలిపి   పోరాడాలి. ఈ విషయం ఇప్పటికీ పలు సందర్భాలలో విప్ల‌వోద్య‌మం తన ఆచరణ ద్వారా నిరూపించింది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామిక తెలంగాణ అంటూ  ప్ర‌జాస్వామిక  వైఖరిని ఎత్తిపడుతూనే  వ‌ర్గ‌పోరాటాన్ని ముందుకు తీసికెళ్లేందుకు కృషి చేసింది.


మన దేశంలో వందలాది తెగలు సహజీవనం చేస్తున్నవి. వాటి జీవన విధానం ఎంతోవైవిధ్యంతో కూడుకున్నది. వాటికి తమదంటూ భాషా, సంస్కృతులున్నవి. కానీ వాటి వికాసక్రమాన్ని,దోపిడీ పాలక వర్గాలు అడ్డుకున్న ఫలితంగా వాటి “అభివృద్ధి వక్రమార్గం పట్టింది, లేదాఅపసవ్యంగా మారింది. వారు నివసించే ప్రాంతాలు నేటికీ అపార ప్రాకృతిక వనరులకునిలయాలుగా ఉండి, దేశ ప్రజల అవసరాలు తీరుస్తూ, పర్యావరణ సమతుల్యతకు ప్రధానకేంద్రాలుగా ఉన్నాయి. మూలవాసులలో నరనరాన జీర్ణించుకొని ఉన్న తరతరాల ప్రజాస్వామ్యభావన, సోదర భావం, సామూహికత, సమష్టితత్వం ఫలితంగా వారు తమపై కొనసాగినఅనేక దాడులను, యుద్ధాలను సమైక్యంగా ఎదుర్మొన్నారు. మన దేశంలో బ్రిటిష్‌ వారికివ్యతిరేకంగా మొదటి పోరు శంఖం ఊదింది మూలవాసులే! వారు ఇప్పటికీ తమ మనుగడకోసమే కాదు, ఈ అడవులు, సంపదలు తమకే, తమ దేశ ప్రజలకే చెందాలనీ బలంగాఅకాంక్షిస్తూ పోరుకేతనాన్ని ఎగురవేస్తున్నారు. కానీ, నిన్నటి బ్రిటిష్‌ వలసాధిపతుల పాలనలోకానీ, వారి అడుగు జాడలలో నడుస్తున్న వర్తమాన భారత పాలకుల ఏలుబడిలో కానీ వారివీరోచిత పోరాటాలన్నీ ఉక్కుపాదాల కింద అణచివేయబడుతున్నాయి. ప్రస్తుత పాలకులువారిపై మావోయిస్టుల‌నే  ముద్రవేశారు.


చరిత్రలో బ్రాహ్మణవాద కులాచారాలను, దౌర్జన్యాలను, పరమ నికృష్టమైన అంటరానితనాన్నితట్టుకోలేక క్రైస్తవం లేదా ఇస్లాంలలోకి మారారు. వారిని ఇపుడు పరమత సహనం తెలియని హిందూ ఛాందసవాదులు ‘పునరాగమనం’ (ఘర్‌ వాప్సీ) పేరుతో దౌర్దన్యంతో హైందవంలోకిమార్చుకుంటున్నారు. వారిని రియాక్షనరీ సంఘ్‌ ముఠా (కాషాయ బ్రిగెడ్‌)తో పాటు హిందూభావజాలం నరనరాన జీర్ణించుకుపోయిన భారత దోపిడీ ప్రభుత్వాలు మూలవాసులుగా గుర్తించనిరాకరిస్తూ వారి చారిత్రిక అస్థిత్వాన్ని అత్మ గౌరవాన్ని కాలరాచి వేస్తున్నారు. వారు విప్లవాలమార్గం పట్టకుండా నివారించడానికి భారత రాజ్యాంగంలో కొన్ని సంస్కరణల ఆశలను చూపి5వ, 6వ షెడ్యూల్‌లను పొందుపరిచారు. ఆ తరువాత మావోయిస్టు ఉద్యమాల నుండి వారిని దూరం చేస్తూ వారి పోరాటాలను పక్కదారులు పట్టించడానికి 1996లో పెసా చట్టాన్నిముందుకు తెచ్చారు. అంతే కాదు, ప్రపంచ బ్యాంకు గైడెన్స్‌లో 1988లో ‘జాతీయ అటవీవిధానం – సంయుక్త అటవీ యాజమాన్య ప్రోగ్రాంను రూపొందించి ఆదివాసులకు అడవుల యాజమాన్యంలో భాగస్వామ్యం అంటూ వారిని కాపలాదారుల స్థాయికి కుదించారు. 2006లో నూతన అటవీ చట్టాన్ని రూపొందించారు. కానీ అమలు కానీ ఆ చట్టాలతో, కంటితుడుపు సంస్కరణలతో మూలవాసుల ఉద్యమాలు సహజంగానే దేశంలో అగడం లేదు. దేశంలోనివ్యూహాత్మక ప్రాంతాలలోని ప్రధాన మూలవాసీ తెగల ప్రజలు విప్ల‌వోద్య‌మంతో అత్యంత సన్నిహితంగా పెనవేసుకపోయి ఉన్నారు. వారు నిజమైన తమ ప్రజాస్వామిక అటానమస్‌(స్వయం పాలన) ప్రాంతాల స్థాపనను బలంగా కోరుకుంటున్నారు. అత్యంత పోరాట చేవగల ఆ ప్రజలు నిన్నటి ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలలో వంచింపబడ్డారు. ఒకే తెగ సమూహాలు వేరువేరు రాష్ట్రాలలోకి విభజించబడినారు. వారి ఏకత్వం, ఐక్యత, అచార వ్యవహారాలు,భాషా-సంస్కృతులకు, జాతులుగా వారి వికాసానికి హాని కలిగింది.

ఆ వాస్తవాన్ని వారికి చారిత్రకంగా బోధించి మూలవాసుల ప్రాదుర్భావ జాతుల వికాసానికిపోరాడాలి. మన దేశంలోని దళితులు, ఆదివాసులు, మత మైనార్టీలు, శ్రామిక (కులాల) ప్రజానీకం హిందుత్వాన్ని నయా ఉదారవాదాన్ని బలంగా వ్యతిరేకిస్తున్నారు. అవి రెండూ తోడు దొంగలుగా మన దేశ పీడిత ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయి. కాలం చెల్లిన కరుడు గట్టిన ప్రతిగామిలేదా యధాతథవాద బ్రాహ్మణీయ సంస్కృతిని సామ్రాజ్యవాదం సొమ్ము చేసుకుంటున్నది. ప్రపంచీకరణ ఫేజులో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందంటూ ‘గ్లోబల్‌ విలేజిలో తనసరుకుల సంస్కృతిని (వస్తు వ్యామోహ సంస్కృతిని) వ్యాపింపచేస్తోంది. వీటిని విప్లవోద్యమం బలంగా, నిర్ధంద్వంగా అడ్డుకుంటున్నది. ప్రజలను దీని ప్రభావం నుండి బయటకు తేవడానికి విప్లవోద్యమ శక్తులు ఓపికతో కూడిన అలుపెరుగని కృషి తీవ్రం చేయాలి.


పైన పేర్కొన్న సమస్యల పరిష్కారానికి నిజమైన ప్రత్యామ్నాయం విప్లవోద్యమమే తప్ప మరోటి లేద‌ని ప్ర‌క‌టించ‌డ‌మే అస‌లైన ప్ర‌జా సంస్కృతికి పునాది అవుతుంది.

Leave a Reply