ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడ అనేక రూపాలలో కొనసాగుతుంది. అందులో ఒకటి క్రోనీ క్యాపిటలిజం. (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) అని మనం పిలుస్తున్నాం. ఆసియా టైగర్‌గా పిలువబడే నాలుగు దేశాలు దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చెంది 1960-96 వరకు సంవత్సరానికి 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాయి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐయంఎఫ్) సంస్థలు ఆ దేశాల అభివృద్ధి తీరును బాగా శ్లాఘించాయి. అయితే 1997లో ఆసియా టైగర్ దేశాల ద్రవ్యవ్యవస్థ ఒకేసారి కుప్పకూలింది. అయితే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆసియా టైగర్ దేశాల ఆర్థిక వ్యవస్థలు