ఈ పుస్తకం మీ కోసం. దేశంలో ఉత్పత్తి సంబంధాల తీరును అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందని మీకు అందిస్తున్నాం. చదవండి.. చర్చించండి. భారతదేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి అయి పెట్టుబడిదారీ విధానంగా మారిందని, అయితే ఈ మార్చు సంప్రదాయ (క్లాసికల్) రూపంలో కాకుండా ఈ దేశ విశిష్ట లక్షణాలపై ఆధారపడి మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని చూడాలని కొంతమంది వాదిస్తున్నారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చివరకు రష్యా దేశాలలో ఇలాగే జరిగాయని చారిత్రక ఉదాహరణలు చూపెడుతున్నారు. నేడు అర్ధ వలస, అర్ధభూస్వామ్య విధానంలో సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలో దేశంలో పెట్టుబడిదారీ విధానం వృద్ధి కావడం సాధ్యం