చెదిరినసమాజం
మూలం: చినువా అచ్ బె తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart] దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,