అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం
అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి