కథనం

విప్లవానికి వెలుగునిచ్చే అమ్మ ప్రేమ…

‌‌నవ మాసాలు మోసి   జన్మనిచ్చిన పిల్లలపై  ఏ అమ్మకు ప్రేమ ఉండదు!? స్వచ్ఛమైన అమ్మ ప్రేమని దేనితో వెలకట్టగలం? అమ్మ తన రక్తమాంసాలతో పుట్టిన పసికందును కంటికి రెప్పలా కాపాడుతుంది. చందమామను చూపిస్తూ ఆప్యాయత, అనురాగాలనే గోరుముద్దలుగా తినిపిస్తుంది. తొస్సుబోయే పసినాటి చిలిపి పలుకులకు మాటవుతుంది. బుడి, బుడి తప్పటడుగులకు నడకవుతుంది. ఈసమెత్తు కల్లాకపటం తెలియని మమకారాన్నందిస్తుంది. ఎవ్వరికీ తలొంచని తెగువ, ధైర్యాన్నిస్తుంది. ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బతుకు బండి లాగుతుంది. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు ప్రపంచాన్నే జయించానని సంబరపడిపోతుంది. వారు సమాజమే హర్షించదగ్గ పిల్లలుగా పరివర్తన చెందినప్పుడు 'నింగి-నేలా నాదే ' అన్న పరిపూర్ణ విశ్వాసంతో