‘ఎర్రదుక్కి’లో పాలమూరు వలస దు:ఖం
సమాజంతో సంబంధం కలిగిన రచయితలు మాత్రమే తమ సాహిత్య సృజనలోకి సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకొని ప్రజల్ని ఆలోచింపచేస్తారు. సామాజిక బాధ్యత, నిబద్దత కలిగిన రచయిత అట్టడుగు శ్రామిక వర్గాలవైపు నిలబడి అక్షరీకరిస్తాడు. ఇలాంటి కోవకు చెందినవారే నాగర్‍కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన రచయిత మడుమనుకల నారాయణ. పాలమూరు అధ్యయన వేదికలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నారాయణ వేదిక ద్వారా పొందిన సామాజిక జ్ఞానంతో కవిత్వం, పాటలు, కథల ద్వారా సాహిత్య సృజనతో సామాజిక చలనాలను ఆవిష్కరించారు. రచయితగా తన అనుభవాలను, తన చుట్టు జరుగుతున్న పరిణామాలను సమాజంతో పంచుకోవడానికి నారాయణ కథా పక్రియను ఎంచుకున్నారు. ‘ఎర్రదుక్కి’