కార్పొరేటమ్మా - రాజకుమారుడు. భరించలేని వాస్తవాలు , ఒక్కోసారి తిరగేసి చెప్తూనే తప్ప సంతృప్తినివ్వనంత , వొత్తడికి గురిచేస్తాయి. నడుస్తున్న చరిత్ర తలకిందులతనాన్ని భరించడమెలాగో తెలియనప్పుడు మనం తలకిందులుగా నడవడమే ఏకైక మార్గంగా అనిపిస్తుంది. అప్పుడు కార్పొరేటమ్మా - రాజకూమారుడు లాంటి అధివాస్తవిక కథలే వస్తాయి. అధివాస్తవికత , వ్యంగం , వాస్తవికత మూడూ ఒకే కథలో కథనమై కన్పిస్తాయి. ఆ కలగాపులగపు కథనం , యేది వాస్తవమో , యేది అధివాస్తవమో తేల్చుకోమని పాఠకులకు సవాళ్ విసురుతుంది. ఒక కథ మొత్తం కథనం ఒక రకమైన ధోరిణిలో నడవడానికి , చదవడానికీ అలవాటు పడ్డాం కదా ,