నిషేధాల మధ్య ఆవిర్భవించిన కవి
కవి నడిచి వచ్చిన దారి తననెప్పుడూ ప్రజల వైపు నిలబెడుతుంది. కవిత్వంలో అత్యంత ఆధునిక శైలిలో తనకంటూ ఒక ఫ్రేంతో మనకు సుపరిచుతులైన కవి ఆశారాజు గారు. సిటీ లైఫ్ లోని సంక్లిష్టతను సున్నితంగా సరళంగా తనే రాయగలరని అందరికీ ఎరుక. ప్రతీ కవితలోనూ తన డిక్షన్ ఓ ప్రత్యేకతని మనకు అనుభూతిలోకి తెస్తుంది. వరుసగా వచ్చే తన కవితా సంపుటాలలో నవ్యత తొణికిసలాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ని మనం తన కవిత్వాన్ని చదివేటప్పుడు ఫీల్ కాగలం. తను కట్టే దృశ్య చిత్ర మాలిక మన మనో ఫలకంపై కదలాడుతూ వుంటుంది. అదే కవి సామాజిక సంక్లిష్టతపై, కల్లోలంపై