మూడు రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయం కాదు
నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు... అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు. ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే