ముస్లిం బతుకు గుబాళింపు
ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్’. షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలున్నాయి. ముందు పేజిలో చెప్పినట్టుగా మొహర్ ` అనుమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణిచివేతల మధ్య అనేక గాయాలను మోసుకుంటూ ఉనికి కోసం పెనుగులాడే ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. ‘వెతుకులాట’ శీర్షికతో ఎ.కె. ప్రభాకర్ చక్కని ముందుమాట రాశారు. ‘తెలుగు సాహిత్యంపై కొత్త ముద్ర’గా షాజహానా పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరించారు, తొలి పేజీలలో. ఇక పుస్తకం లోపలికి వెళ్తే ‘మొహర్’ కథల్లో రచయిత్రులు అనేక అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లో కేంద్రీకృత