‘స్టిల్ షీ ఈజ్ అలైవ్’
సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి, నెత్తుటినది కాస్త రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను