ఆదివాసీ పరిరక్షణకు ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నిద్దాం
(మధ్య భారతదేశంలో ఆదివాసులపై ప్రభుత్వ బలగాల హత్యాకాండ కు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ సన్నాహాల్లో భాగంగా 25, శనివారం ఉదయం 10 గంటలకు, హైదరాబాదులో ని సుందరయ్య విజ్ఞానకేంద్రం, షోయబ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పౌరహక్కుల సంఘం ప్రవేశపెట్టిన కీనోట్ ) మితృలారా.. ఆదివాసులకు భారత రాజ్యాంగం హామీ పడిన హక్కులు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయాయి. అడవి, సహజ వనరులు, పర్యావరణం, ఆదివాసుల జీవనోపాధులతో సహా వాళ్ల జీవించే హక్కును సహితం భారత ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పీడిత సమూహాలన్నిటి రక్షణ కోసం అనేక ప్రత్యేక చట్టాలను రాజ్యాంగం ప్రకటించింది. ఇందులో ఆదివాసల