ఖండన

ఆదివాసులపై వైమానిక యుద్ధాన్ని ఖండించండి

రాజ్యంగ వ్యతిరేక ఫాసిస్టు దాడులపై ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేద్దాం ఏప్రిల్‌ 7వ తేదీ శుక్రవారం దండకారణ్యంలో మరోసారి భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. ఈ ఏడాది జనవరి 11న  గగన తల దాడులు జరిగిన మూడు నెలలకల్లా మరోసారి డ్రోన్ల నుంచి  బాంబులు విసిరారు. పామేడు ప్రాంతంలోని బట్టిగూడ, కవరగట్ట, మీనగట్ట,  జబ్బగట్ట గ్రామాల పరిధిలో తెల్లవారు జామున  ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆదివాసులు ఆ సమయంలో విప్ప పూలు ఏరుకోడానికి అడవిలోకి వెళ్లారు. కొందరు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన బాంబు దాడులు ఐదు నిమిషాల వ్యవధిలో వేర్వేరు