దేఖేంగే.. అబ్ దేఖేంగే
ఈ నెత్తుటేరులు పారుడెప్పుడు ఆగునో..మా ఆదివాసుల బతుకులెప్పుడు మారునో..ఆకులలములు ఏరుకుంటా వనముకండగ ఉండి సాదినం..నోరులేని మూగ జీవులదోస్తీగట్టి కలిసి బతికినం "ఈ"యాడజూడూ మిలటరోల్లేఈ క్యాంపు లెవరూ అడిగిరో..ఎవని కండగ మందగొచ్చిరొఎంటవెట్టీ మము తరుమవట్టిరి.. "ఈ"నెత్తురొలకని ఘడియలేదు గొంతు పెగలని క్షణము లేదు..వొందలేండ్ల సంది జూడబతుకలన్నీ సలుపు గాయమే.. "ఈ"కొండకోనలు గొల్లుమన్నాతవ్విపోతలు ఆపనేఆపమన్నరు.. కని పెంచిన నేలకోసం ప్రాణమిచ్చే రణంగడ్తిమి తల్లులం.. "ఈ"మల్టినేషను కార్పొరేటుల ఊడిగంల ఏలెటోని కళ్ళుగమ్మె..దేశభక్తని మూలవాసుల తరమ వట్టెను పాడు రాజ్యం.. "ఈ"సిగ్గు శరములిడిసిపెట్టి శత్రులోలె మట్టు వెడతనె..మానాల్దీసీ గోసలు బెట్టి గుండ్లుదించి సంపవట్టె వీనిఫౌజు.. "ఈ"వికాస కూతలు ఎన్నోకూస్తూ ఎవనెవనికో అమ్మజూస్తే జాగీరోలే..చెట్టు పుట్టా