ఈ ‘తెలుగుదనం’ దేనికి?
కొన్ని ‘ఆలోచనలు’ భలే ఉంటాయి. దేనికి ముందుకు వస్తాయోగాని, అసలు విషయాలను బైటపెడతాయి. కె. శ్రీనివాస్ ఆగస్టు 15 ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?’’ అనే వ్యాసం అట్లాంటిది. కాకపోతే తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల గురించి వీలైనంత వెనక్కి వెళ్లి పాత విషయాలే మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రగతిశీల సాహిత్య మేధో రంగాల మీద విమర్శనాత్మక పున:పరిశీలన పెరుగుతున్నది. ఇది చాలా అవసరం. ఎక్కడ బయల్దేరాం? ఎట్లా ప్రయాణిస్తున్నాం? దీని గురించి మన అంచనాలేమిటి? అని తరచి చూసుకోవడం మంచిది. ఒకప్పటి కంటే కాస్త ఎక్కువగా చుట్టుపక్కల