కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు
కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల